ఇటీవలే కాలంలో ప్రేమ అన్నది మోసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అంతేకాదు ఎంతోమంది మోసగాళ్లకు ప్రేమ ఒక బలమైన ఆయుధంగా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ప్రేమ అనే ముసుగు వేసుకొని మంచి వాళ్ళలా ప్రవర్తిస్తూ మాయమాటలతో ఎంతో మంది యువతులను ముగ్గులోకి దింపుతూ ఉన్నారు మోసగాళ్ళు. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటు మాయమాటలతో సహజీవనం కూడా చేస్తూ ఉన్నారు. చివరికి అన్ని రకాల అవసరాలు తీర్చుకుని నడిరోడ్డున వదిలేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 ఓ మహిళ ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మింది. ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో అతనికి సర్వస్వం ధారపోసింది. కొన్నాళ్లపాటు సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎనిమిదేళ్లలో 14 సార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు సదరు వ్యక్తి. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడు. దీంతో ఎంతో మనో వేదనకు గురైన సదరు మహిళ చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. సదరు మహిళకు అప్పటికే పెళ్లయింది. కానీ మనస్పర్థల తో భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉంటున్న 33 ఏళ్ల బాధితురాలితో బీహార్కు చెందిన గౌతం అనే వ్యక్తికి పరిచయం ఏర్పడింది.


 ఈ క్రమంలోనే వీరి మధ్య పరిచయంలో కాస్త చనువు పెరిగింది. ఇక పెళ్ళి చేసుకుంటాను అంటూ నమ్మించాడు సదరు వ్యక్తి.  ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తూ ఉండగా మహిళకు 14 సార్లు గర్భం వచ్చింది. ఏదో ఒక మాయ మాటలు చెప్పి 14 సార్లు అబార్షన్ చేయించాడు. ఇటీవలే పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడు. దీంతో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె దుస్తుల్లో సూసైడ్ నోట్ గుర్తించారు పోలీసులు. అతడు చేసిన తప్పుల కు సంబంధించిన అన్ని ఆధారాలను కూడా సేకరించారు.  నా సెల్ ఫోన్ లో చెక్ చేయండి అంటూ ఇక ఆమె రాసిన నోట్లో ఉంది. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: