ఇటీవలికాలంలో తప్పు అని తెలిసినప్పటికీ ఎంతోమంది వివాహేతర సంబంధాల మాయలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. పెళ్లి చేసుకుని కట్టుకుని కట్టుకున్న వారితో  పిల్లలతో సంతోషంగా ఉండాల్సింది పోయి.. చివరికి పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి పచ్చని కాపురం లో చేజేతులారా చిచ్చు పెట్టుకుంటున్న  ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా కట్టుకున్న వారిని మోసం చేసి ఏకంగా పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి చివరికి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తీసుకు వస్తున్నారు. అంతే కాదు నేటి రోజుల్లో వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలలో విషాదానికి కారణం అవుతున్నాయ్ అని చెప్పాలి.


 అక్రమ సంబంధాల కారణంగా దారుణంగా కట్టుకున్న వారిని హత్య చేస్తున్న వారు కొంతమంది అయితే.. కావలసిన వారే మోసం చేశారు అన్న విషయాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరికొంతమంది. వెరసి రోజు రోజుకి వివాహేతర సంబంధాల కారణంగా పోతున్న ప్రాణాలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ తల్లి వివాహేతర సంబంధం  కొడుకు ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ విషాదకర ఘటన ఏలూరులో వెలుగుచూసింది. వివాహేతర సంబంధాన్ని మానుకోవాలి అంటూ కొడుకు ఎన్నిసార్లు చెప్పినా వినక పోవడంతో కొడుకు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.


 భీమడోలు గాంధీ బొమ్మ సెంటర్ కు చెందిన వెంకట్ అనే 21 ఏళ్ల యువకుడు తాఫీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతని తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లితో కలిసి ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత కొన్ని రోజుల నుంచి తల్లి వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కొడుక్కు తెలియడంతో తరచూ ఇదే విషయంపై తల్లితో గొడవ పడుతూ ఉండేవాడు. ఎన్నిసార్లు హెచ్చరించిన తల్లితీరు మాత్రం మారలేదు. ఇటీవలే మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లగా తల్లి ప్రియుడితో కలిసి కనిపించకూడని స్థితిలో కనిపించింది. దీంతో మనస్తాపంతో మద్యం సేవించి చివరికిఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: