ఇటీవల కాలంలో భార్య భర్తల బంధం హత్యలకు ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అదేంటండి  అంతమాట అనేసారు అని అంటారా.. ఇది నేను చెప్పడం కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చెబుతున్నాయి. భార్య భర్తల అంటే ఒక్కరంటే ఒక్కరికీ ప్రాణంలా ఉండాలి కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి.  ఇక తమ దాంపత్య బంధం కారణంగా ఈ లోకంలోకి వచ్చిన పిల్లలను ఎంతో సంతోషంగా చూసుకోవాలి.. పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి పని చేయాలి. కానీ నేటి రోజుల్లో ఇలాంటి భార్య భర్తలు ఎక్కడా కనిపించడం లేదు. కేవలం మనస్పర్థల తో  శత్రువులుగా మారి ఒకరిఒకరు ప్రాణాలు తీసుకుంటున్న వారే కనిపిస్తున్నారు.


 మరోవైపు భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా ఏకంగా తమ రక్తం పంచుకుని పుట్టిన పిల్లలను కూడా దారుణంగా చంపేస్తున్న ఘటనలు వెలుగు లోకి  వస్తున్నాయి. ఇక్కడ  ఈ ఘటన జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కోడూరు మండలంలో ఓ దారుణ ఘటన జరిగింది. కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామానికి చెందిన ఓంకార్ భార్య చనిపోవడంతో జువారి పల్లికి చెందిన మరో మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు.. పెళ్లయ్యాక ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది సదరు మహిళ. ఇలాంటి సమయంలోనే మల్లేశ్వరి అనే మహిళను మూడో పెళ్ళి చేసుకున్నాడు.


 వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తానని చెప్పి ద్విచక్రవాహనంపై భార్య పిల్లల్ని తీసుకుని నాగర్కర్నూల్ బయలుదేరాడు. ఇంతలో  భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే భార్యను బైక్ పై నుంచి తోసేసి పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. కోడేరు మండల శివారులో బైక్ ఆఫ్ ఇద్దరు పిల్లల్ని గుట్టపైకి తీసుకెళ్లి గొంతు కోసి  చంపేశాడు. అనంతరం తాను కూడా గొంతు కోసుకున్నాడు.. గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: