సాధారణంగా ఇళ్లల్లో ఎలుకల బెడదా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలా ఇంట్లో ఎలుకలు ఉన్నాయి అంటే చాలు ఎన్నో విలువైన వస్తువులను సైతం నాశనం చేస్తూ ఎంతగానో నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయ్. అందుకే ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటే ఇక వాటిని పట్టుకొని చంపేయడానికి ఎంతో మంది సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక మీరు కూడా ఇప్పుడు వరకు ఎన్నోసార్లు ఇలా ఇంట్లో ఉన్న ఎలుకలను పట్టుకుని చంపే ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక ఎలుకను చంపినందుకు గాను అతనిపై పోలీసు కేసు నమోదు అయింది. ఈ ఘటన కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బదోన్ లో ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా ఎలుక ప్రాణాలు తీసాడు. ఎలుక తోకకు తాడు కట్టి.  ఇక రాయి ముక్కకు కట్టి కాలువలో పడేసి ముంచుతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలోనే అటువైపుగా వెళ్తున్న జంతువు ప్రేమికుడు వీకేంద్ర ఎలుకను కాపాడే ప్రయత్నం చేయగా... వెంటనే సదరు వ్యక్తి ఆ ఎలుకను కాలువలో పడేసాడు.. ఇక వికేంద్ర ఏకంగా కాలువలోకి దూకి మరి సదరు ఎలుకను బయటకు తీసిన చివరికి ఆ ఎలుక చనిపోయింది. ఈ క్రమంలోనే జంతు ప్రేమికుడైన వికేంద్ర జంతు సంరక్షణ కేంద్రం వద్ద దరఖాస్తు చేయగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


 పోలీసులు వెంటనే సదరు వ్యక్తిని అరెస్టు చేశారు కానీ ఆ తర్వాత వదిలేసారు. అయితే ఇక ఇలా ఈ ఘటనలో చనిపోయిన ఎలుకకు పోస్టుమార్టం కోసం ఐవిఆర్ఐకి పంపించడం గమనార్హం. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అదేంటి ఇప్పటివరకు ఎంతోమంది ఎలుకలను చంపడం చూశాం. కానీ ఇలా పోలీసు కేసు నమోదు కావడం మాత్రం ఇప్పటివరకు చూడలేదు. అయితే ఇక ఇదే విషయంపై జంతు ప్రేమికుడు వికేంద్ర స్పందిస్తూ ఇక మనోజ్ అనే వ్యక్తి ప్రతిరోజు ఎలుకలను ఇలాగే చంపేవాడు అన్న విషయాన్ని ఒప్పుకున్నాడు అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rat