సాధారణంగా భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి.  కానీ ఇటీవల కాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాదు కనీసం ఒకరిపై ఒకరికి మానవత్వం కూడా కనిపించడం లేదు అని చెప్పాలి. ఎందుకంటే పెళ్లి అనే బంధంతో ఏకంగా దాంపత్య బంధం లోకి అడుగుపెట్టిన వారు కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కడవరకు తోడుండాల్సి ఉంటుంది.  కానీ ఇటీవల కాలంలో భార్యాభర్తలు మాత్రం ఏకంగా చిన్న చిన్న గొడవల కారణంగానే విడిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.


 ఇక మరోవైపు ఏకంగా అక్రమ సంబంధాల పేరుతో కట్టుకున్న వారిని దారుణంగా కడ తేరుస్తున్న ఘటనలు కూడా ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంకొంతమంది ఏకంగా ఆస్తుల కోసం కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య పేరు మీద ఉన్న బీమా డబ్బులు కోసం ఆశపడిన ఒక భర్త చివరికి దారుణానికి ఓడిగట్టాడు అనే చెప్పాలి. ఏకంగా కట్టుకున్న భార్యను ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సింది పోయి యమకింకరుడుగా మారిపోయాడు. రౌడీ షీటర్ కు సుపారీ ఇచ్చి మరి దారుణంగా కట్టుకున్న భార్యను హత్య చేయించాడు భర్త. ఇక ఆ తర్వాత తన భార్య హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి నమ్మించేందుకు ప్రయత్నించాడు. తద్వారా ఇక ఆమె పేరు మీద ఉన్న 1.90 కోట్ల రూపాయల బీమాను కాజేయాలి అని ప్రయత్నించాడు. ఈ ఘటన జైపూర్లో వెలుగు చూసింది. మహేష్ కు 2015లో షాలు అనే మహిళతో పెళ్లి జరగగా.. వీరి మధ్య విభేదాలు రావడంతో పుట్టింట్లో ఉంటుంది షాలు. ఇటీవల భార్య పేరు మీద 1.90 కోట్ల బీమా చేయించి చివరికి బారిన హత్య చేయించాడు. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: