ఇలా తమ కొడుకు బాగా చదువుకొని ప్రయోజకుడు అవుతాడు అనే తల్లిదండ్రులు భారీగా ఆశలు పెట్టుకుంటే ఇక వారి ఆశలను కొంతమంది అడియాశలు చేసేస్తున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ విఫలమైంది అన్న కారణంతో యువకుడు మనస్థాపం చెందాడు. జీవితం అక్కడితో ముగిసిపోయింది అని భావించాడు. బ్రతికి కూడా వృధా అని అనుకున్నాడు. దీంతో క్షణికావేశంలో తనువు చాలించాలి అని నిర్ణయించుకున్నాడు. చివరికి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ తన మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.
ఈ విషాదకర ఘటన హైదరాబాద్ శివారులోని శంకర్పల్లి రైల్వే స్టేషన్లో వెలుగులోకి వచ్చింది. తాండూరు అల్లాపూర్ కు చెందిన మహేష్ అనే 21 ఏళ్ళ వ్యక్తి మల్లారెడ్డి కాలేజీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నాడు. దివ్య అనే యువతీతో మహేష్ ప్రేమలో ఉన్నాడు. ఇటీవలే సదరు యువతీ మహేష్ను మోసం చేసింది. దీంతో ఎంతగానో మనస్థాపం చెందాడు మహేష్. ఇక ప్రేయసి మోసం చేసిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇక ఇటీవల సెల్ఫీ వీడియో తీసి తల్లిదండ్రులకు పంపాడు. నన్ను క్షమించండి అమ్మ నాన్న అంటూ రైలు పట్టాలపై తలపెట్టి చివరికి ప్రాణాలు వదిలాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి