
అయితే ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన నీచులకు ఏకంగా కోర్టులు కూడా కఠినమైన శిక్షలు విధిస్తూ ఉండడం గమనార్హం. కాగా 11 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతి చేసిన కామాంధుడికి ఏకంగా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది నల్గొండ జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయమూర్తి బి తిరుపతి ఈ తీర్పును వెలువరించారు. గత ఏడాది డిసెంబర్లో నల్గొండ సమీపంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికకు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న నిజాముద్దీన్ మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది.
బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు. విచారణ జరిపారు. ఈ క్రమంలోనే నిందితుడు నిజాముద్దీన్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు అని చెప్పాలి. ఈ కేసు పై విచారణ జరిపిన కోర్టు. అతనికి కఠినమైన శిక్షణ విధించింది. ఏకంగా మూడు వేరువేరు నేరాలకు గాను 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ఈ మూడు శిక్షలను ఏకకాలంలో అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బాధితురాలికి 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది కోర్టు.