ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ఏకంగా సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులు కాదు మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలేమో అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఏకంగా కామందులుగా మారిపోతున్న ఎంతోమంది మగాళ్లు చివరికి సాటి మనుషుల విషయంలో అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఏకంగా మృగంలా మారిపోయి కనీసం మానవత్వం కూడా చూపించకుండా అత్యంత దారుణంగా అత్యాచారాలు చేస్తున్న ఘటనలు సభ్య సమాచారాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే ఇలా అత్యాచారాలు చేసిన వారిని శిక్షించేందుకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకువచ్చిన ఎక్కడ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అయితే మొన్నటి వరకు ఏకంగా ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే అత్యాచారం చేసిన మానవ మృగాలను మాత్రమే చూసాం. కానీ ఇటీవల కాలంలో ఏకంగా మూగజీవాలను కూడా వదలకుండా ఆత్యాచారం చేస్తున్న నీచులు కూడా సభ్య సమాజంలో కనిపిస్తున్నారు. అంతేకాదు ఇక మగాళ్ళను కూడా వదలకుండా అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.


 ఇటీవల ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ క్రమంలోనే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే విచారణలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా వాసి అయిన మన్యం నాయక్ అనే 53 ఏళ్ల వ్యక్తి స్వగ్రామంలో మరో వ్యక్తితో అసహజ శృంగారం చేసేవాడు. అయితే ఇటీవల దుర్గ భవాని నగర్ వచ్చాడు. అక్కడే ఉంటున్న పదేళ్ల బాలుడుతో స్నేహంగా ఉంటూ ఇటీవలే పార్కులోకి తీసుకొని వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడి పోయిన మన్యం నాయక్.. ఇక ఆ బాలుడి ముక్కు నోరు  మూసి డ్రైనేజీలో పడేయగా.. చివరికి తలకు గాయమై చనిపోయాడు. ఈ క్రమంలోనే నిందితున్ని అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: