చిన్నచిన్న కారణాలకే మృగం లా మారి పోతున్న మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి దారుణాలు చేసేస్తూ ఉన్నాడు. ఏకంగా చాక్లెట్ తిన్నంత ఈజీగా మనిషి ప్రాణాలను గాల్లో కలీపేస్తూ ఉన్నాడు. కొంత మంది అయితే ఏకంగా సొంత వారి విషయంలో కూడా కాస్తైనా జాలీ దయ లేకుండా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన గురించే. ఏకంగా కూతురుతో అసభ్య ప్రవర్తన చేసిన పోకిరిలను ఇలా ఎందుకు చేశారు అనే ప్రశ్నించినందుకు ఏకంగా కత్తితో తండ్రి పై దాడి చేశారు యువకులు.
తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానిక దుకాణానికి వెళ్ళిన యువతి పై సురేష్ అనే యువకుడు నీళ్లు పోసి అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఆమె వెళ్లి జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. ఇక సురేష్ ను నిలదీసేందుకు యువతి తల్లిదండ్రులు వెళ్లగా. వారిపై నిందితుడి గ్యాంగ్ దాడి చేసింది. సురేష్ స్నేహితుడు కత్తితో యువతి తండ్రి గొంతు కోశాడు. ఈ ఘటనతో స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి