వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతాడని అందరూ ఊహించారు. కానీ కష్టపడి పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి అందరికీ తెలిసిందే. అయితే జగన్ కొన్ని విషయాల్లో అంచనాల ప్రకారం వెళుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2024 మార్చిలో రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి.


ప్రస్తుతం వైసీపీ నుంచి 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అప్పుడు మరో మూడింటికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ మూడు స్థానాలు వైసీపీ అభ్యర్థులు ఈజీగా గెలవొచ్చు. తద్వారా రాజ్యసభలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు ఉన్న పార్టీ కేవలం వైసీపీ మాత్రమే అవుతుంది. రాజ్యసభలో ఏదైనా బిల్లు కావాలన్నా, వద్దనుకున్న వైసీపీ ఎంపీల పాత్ర కీలకం కానుంది. కాబట్టి వైఎస్ జగన్ ముందస్తుకు వెళ్లకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.


గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆరుగురు రాజ్యసభ సభ్యులు పైనే ఉంటే ఆయనకు కేంద్రంలోని బీజేపీ పార్టీ గౌరవం ఇచ్చేది. రాజ్యసభలో ఏదైనా బిల్లు పాస్ కావాలంటే టీడీపీ సభ్యుల మద్దతు అప్పుడు అవసరమయ్యేది. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో చేరిపోయారు. టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి ఇందులో ప్రస్తుతం ముగ్గురి పదవి కాలం అయిపోయింది  


టీడీపీ ఇక్కడ అధికారంలో కూడా లేదు. కాబట్టి కేంద్రంలోని జాతీయ పార్టీలు కనీసం చంద్రబాబును మాటకైనా పలకరించడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు జాతీయ పార్టీలను శాసించి ఎవరూ అధికారంలో ఉన్న పనులు చక్కబెట్టే చంద్రబాబుకు ప్రస్తుత పరిస్థితి మింగుడు పడినదే. ఇలాంటి పరిస్థితులు రాకుండా సీఎం జగన్ ముందు జాగ్రత్త పడుతున్నారు. ముందస్తుకు వెళితే ఒరిగేదేమీ లేదని భావిస్తున్నారు. అదే సమయంలో మరో మూడు రాజ్యసభ సభ్యులు పెరిగితే రాబోయే రోజుల్లో ఇక్కడ అధికారంలో ఉన్నా లేకున్నా కేంద్రంలో మంచి పాత్ర పోషించవచ్చని ప్లాన్ వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: