ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే వృద్ధి ఇంజిన్ పై ప్రయాణిస్తున్నాయి. వాటిలో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది. ఈ మాంద్యంలోను బుల్లెట్ రైలు వేగంతో మన దేశం అభివృద్ధి చెందుతోంది. స్వాతంత్ర్యం అనంతరం నుంచి భారతీయ పేదలు గరీబీ హఠావో వంటి నినాదాలు చూశారు. కానీ ఎన్నడూ దాని ఫలితాలు అందుకోలేదు.


కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత పేదరిక నిర్మూలన వంటి అంశాలను చేసి చూపించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంపై ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడం లేదు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి అందేలా అమలు పరచడం, వాటిని ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ పర్యవేక్షించడం వంటివి చేయడం వల్లే ఇది సాధ్యమైంది. దీంతో పాటు భారత్ ఈ పదేళ్లలో గణనీయ ప్రగతి సాధించింది.


ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం మనదేశంలో ఉంది. వీటిని బ్రిటీష్ వారు నిర్మించారు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రధాని మోదీ రైల్వే స్టేషన్లు ఆధునికీకరించి ఆ పేరును తుడిపేసి మేడిన్ ఇండియా గా మార్చారు. దీంతో పాటు దేశీయ  పరిజ్ఙానతంతో వందేభారత్ వంటి రైళ్లను ప్రవేశపెట్టి మన కీర్తిని చాటి చెప్పారు. వీటితో పాటు రోడ్డు మార్గాలు, విమానాలు తదితర వాటిలో మనదైన ముద్ర వేసుకున్నాం.


పార్లమెంట్ సైతం బ్రిటీష్ వారు నిర్మించిందే. మన దైన శైలిలో కొత్త పార్లమెంట్ ను నిర్మించుకున్నాం. మొత్తం మీద బానిసత్వ లక్షణాలను, గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నాం. గతంలో ఎవరూ మన దేశానికి వచ్చినా తాజ్ మహల్ ని చూపించేవారు. అదే ఇప్పుడు అయితే వారణాసి, గుజరాత్ లోని వల్లభ్ భాయ్ పటేల్, తమిళనాడు లోని తంజావూరు, ఇతర పుణ్యక్షేత్రాలతో పాటు అయోధ్యను చూపిస్తున్నారు. దీంతో ఆర్మీ దళాల కోసం ప్రత్యేక భవనాలు ఒకే దగ్గర నిర్మించి దేశ రక్షణకు పెద్ద పీట వేస్తున్నారు. ఇవన్నీ మారుతున్న భారత దేశానికి సజీవ సాక్ష్యాలే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: