ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడాలి అంటే ఖ‌చ్చితంగా చంద్రబాబు వైఖరి మారాలి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. టీడీపీ అధినేత వైఖరిలో మార్పు రాకపోతే మాత్రం పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. ఆయన మూస పద్దతిలో రాజకీయం చేస్తున్నారు అని చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు కూడా. చంద్ర‌బాబు ఇప్ప‌టికే అవుట్ డేటెడ్ పొలిటిషీయ‌న్ అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌తిప‌క్షాలు అయితే ఆయ‌న ఇక విశ్రాంతి తీసుకుంటే మంచిద‌ని కూడా సూచిస్తున్నారు. 

 

ఇక తాజాగా జ‌రుగుతోన్న రెండు రోజుల అసెంబ్లీ స‌మావేశాల విష‌యంలో కూడా చంద్ర‌బాబు అతీగ‌తీ లేకుండా ఓ ప్లానింగ్ అంటూ లేకుండా ముందుకు వెళుతున్నార‌ని... దీనివ‌ల్ల పార్టీని ప్ర‌జ‌లు ఎంత మాత్రం ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌ని సొంత పార్టీ నేత‌లు వాపోతున్న ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు చంద్రబాబు లక్ష్యంగా సొంత పార్టీ నేతలే నేడు అసెంబ్లీ లో విమర్శలు చేశారు అని తెలుస్తుంది. బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో సభ నుంచి వాకౌట్ చేయడంపై ఇప్పుడు సొంత పార్టీ నేతలు తీవ్ర అసహనంగా ఉన్నారు. 

 

స‌రే వాకౌట్ చేస్తే చేసారు గాని అసలు ఎమ్మెల్సీలు ఒకసారి ఎమ్మెల్యేలు ఒకసారి చేయడం ఏంటీ అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న వాకౌట్ చేయాల‌నుకున్న‌ప్పుడు ఎమ్మెల్యేలు ముందుగా బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఎమ్మెల్సీలు మాత్రం లోప‌లే ఉండిపోయారు. దీంతో ఒక్క‌సారిగా పార్టీ నేత‌ల్లోనే తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. అస‌లు పార్టీ అధినేత‌కు వ్యూహం ఉందా ? ఆయ‌న ఏం చేస్తున్నార‌ని తీవ్ర అస‌హ‌నానికి గుర‌య్యారు. 

 

ఇలాంటివి పార్టీ మీద చులకన భావం తీసుకొచ్చే విధంగా ఉంటాయి అని ఏది చేసినా సరే పూర్తిగా చెయ్యాలి అని... అంతే గాని ఇలా సగం సగం పనులు చేస్తే చులకన అవుతారు అంటూ చంద్రబాబుని కొందరు సీనియర్ నేతలు పరోక్షంగా విమర్శించారు అని సమాచారం. ఇక అధికార పార్టీలో కూడా దీనిపై ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. చంద్రబాబు తీరు మీద పార్టీ నేతలు అసహనంగా ఉన్నారు అని వైసీపీ నేతలు గుర్తించారు. ఇదే బ‌య‌ట‌కు వెళితే బాబోరు ప్ర‌తిప‌క్ష పార్టీకి మ‌రింత చుల‌క‌న అయిపోతారన‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: