ఎక్కడైనా వారసత్వ రాజకీయాలు సహజంగానే ఉంటాయి...ఏ నాయకుడైన తన వారసుడుని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సక్సెస్ చేయాలని చూస్తారు. అయితే ఏపీలో ఈ వారసత్వ రాజకీయాలు కాస్త ఎక్కువ నడుస్తాయనే సంగతి తెలిసిందే. ఇక్కడ మెజారిటీ నాయకులు తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకురావడానికి చూస్తారు. అయితే ఈ వారసత్వ రాజకీయాల వల్ల ఒకోసారి బెనిఫిట్ ఉండొచ్చు...ఒకోసారి నష్టం కూడా జరగొచ్చు. ఎందుకంటే ప్రతి నాయకుడు తమ వారసుడుని రాజకీయాల్లోకి తీసుకొస్తే..కింది స్థాయి నుంచి కష్టపడి పనిచేసిన నాయకులకు అవకాశాలు రావు.

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అదే జరుగుతుంది..ఇప్పటికే చాలమంది వారసులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు..అలాగే ఎన్నికల బరిలో కూడా దిగారు..ఇదే క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు నాయకులు తమ వారసులని రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్(నాని) సైతం ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే నాని ఆమదాలవలస రాజకీయాల్లో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. అసలు తమ్మినేని కంటే నానినే ఏదో ఆమదాలవలస ఎమ్మెల్యే లెక్క పనిచేస్తున్నారట.

తమ్మినేని స్పీకర్‌గా ఉండటంతో ఫుల్‌గా రాజకీయాలపై దృష్టి పెట్టడం లేదు..పైగా తన వారసుడుకు అవకాశం ఇవ్వాలని  ఫిక్స్ అయ్యారు కాబట్టి..తన తనయుడుని నియోజకవర్గంలో తిప్పేస్తున్నారట. ఒక షాడో ఎమ్మెల్యే మాదిరిగా నాని ఆమదాలవలసలో పనిచేస్తున్నారని తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ఈయనే చూసుకుంటున్నారట. ఇదే క్రమంలో తన వారసుడుని నెక్స్ట్ ఎన్నికల బరిలో దింపాలని తమ్మినేని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అనుచరులకు హింట్ కూడా ఇచ్చేశారట.

అయితే తమ్మినేని వర్గానికి నాని ఎంట్రీ ఉత్సాహాన్ని ఇస్తుంటే...మొదట నుంచి ఆమదాలవలస వైసీపీలో పనిచేస్తున్న నేతలకు నాని ఎంట్రీ ఏ మాత్రం ఇష్టం లేదట. ఇలా వారసులు ఎంట్రీ ఇచ్చుకుంటూ పోతే తమ పరిస్తితి ఏంటని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారట. దీంతో తమ్మినేని వారసుడు ఎంట్రీకి సొంత పార్టీనే అడ్డుపడేలా ఉంది. మరి చూడాలి నెక్స్ట్ తమ్మినేని వారసుడు ఎంట్రీ ఉంటుందో ఉండదో?

 

మరింత సమాచారం తెలుసుకోండి: