కోడెల శివప్రసాద్ చనిపోయాక సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీకి సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయిన విషయం తెలిసిందే..ఆయన మరణం తర్వాత నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జ్‌ని నియమించలేదు. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. సత్తెనపల్లి సీటు కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్నారు...దీంతో చంద్రబాబు సీటు కేటాయించడంలో కాస్త ఆలోచిస్తున్నారు. ఇక ఈ సీటు కోసం ముందు నుంచి కోడెల తనయుడు శివరాం ట్రై చేస్తూనే ఉన్నారు...ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతూనే ఉన్నారు.

కాకపోతే సత్తెనపల్లిలో శివరాంని వ్యతిరేకించే వర్గం కూడా ఉంది..ఆయనకు సీటు ఇవ్వొద్దని ఆ వర్గం డిమాండ్ చేస్తుంది. ఇక వారిని మంచి చేసుకుని సీటు సాధించాలని శివరాం చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోడెల అక్క‌డ యాక్టివ్ అవుతోన్న ప‌రిస్థితి ఉంది. అలాగే ఈ సీటు కోసం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీ సైతం ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీటు కోసమని రాయపాటి, బాబుని కూడా కలిశారు.

అలాగే అటు మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు సైతం సత్తెనపల్లిలో యాక్టివ్‌గా ప‌నిచేస్తున్నారు.
ఈయన సైతం సీటు ఎలాగైనా దక్కించుకోవాలనే కోణంలో ఉన్నారు. వీరే కాదు ఇంకా పలువురు నేతలు సత్తెనపల్లి సీటుపై కన్నేశారు. అలాగే ఎవరికి వారు సెపరేట్‌గా పార్టీ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళుతున్నారు...తమ వర్గాలతో సెపరేట్‌గా రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. ఇలా ఎవరికి వారు గ్రూపు రాజకీయాలు చేయడంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది...ఎవరికి వారు ఇలా పనిచేసుకుంటూ వెళితే...పార్టీకి నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అందుకే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సత్తెనపల్లి తమ్ముళ్ళు వార్నింగ్ ఇచ్చారు.. ఎవరు ఏ కార్యక్రమం చేసినా సత్తెనపల్లిలో ఉన్న టీడీపీ ఆఫీసులోనే చేయాలని, అలాగే మీడియా సమావేశాలు కూడా అక్కడే పెట్టుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు. అలా కాకుండా ఎవరికి వారు సెపరేట్‌గా కార్యక్రమాలు చేస్తే మాత్రం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మరి ఇకనైనా సత్తెనపల్లి తమ్ముళ్ళు ఈ రచ్చ ఆపుతారేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: