తెలంగాణ కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి కలకలం కొనసాగుతోంది. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని ఆయన ప్రకటించడం పార్టీలో కలకలం రేపింది. జగ్గారెడ్డి ప్రకటనతో కదిలిన కాంగ్రెస్ సీనియర్లు ఆయన్ను బుజ్జగించేందుకు ఎంతో ప్రయత్నించారు. మొత్తానికి ఆ ప్రయత్నాలు ఫలించాయనే చెప్పాలి. reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో జరిగిన చర్చల తర్వాత జగ్గారెడ్డి కాస్త మెత్తబడ్డారు.


మొన్నటి నుండి ఇవాళ్టి వరకూ జరిగిన సంఘటనల దృష్ట్యా ఉత్తమ్‌ కుమార్ రెడ్డితో సమావేశం అయ్యానని.. జరుగుతున్న పరిణామాలతో కొంత మనోవేదన చెందానని జగ్గారెడ్డి అంటున్నారు. అయితే.. తానొక స్టాండ్ తీసుకున్నానని దానికి కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. తనతో అందరూ సీనియర్ నాయకులు ఫోన్లో మాట్లాడారని.. దాని కోసం కొన్ని రోజులు అగాల్సిన అవసరం ఉందని జగ్గా రెడ్డి అంటున్నారు.


అందరం కూర్చొని మాట్లాడుదాం.. రాజీనామా వాయిదా వేసుకోవాలని సీనియర్ నాయకులు సూచించారని.. వారి మాటలకు కట్టుబడి ఉంటున్నానని జగ్గారెడ్డి అన్నారు. వారం, పది రోజులు తొందరపడకూడదని reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారని.. మీ అభిప్రాయాలను దిల్లీకి వెళ్లి చెప్పాలని సలహా ఇచ్చారని.. ఏదేమైనా వారం, పది రోజులు మీడియాలో మాట్లాడటం చేయవద్దని అన్నారని.. ఓ పది రోజులు ఆగమన్నారని జగ్గారెడ్డి వివరించారు.


అయితే.. పది రోజుల తర్వాతైనా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండక పోవచ్చని ఆయన ఇంకా బెదిరింపు దోరణిని కంటిన్యూ చేస్తున్నారు. తాను ప్రస్తుతానికి కాంగ్రెస్ ను వదిలి వెళ్లాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నానని.. అంతేతప్ప తన నిర్ణయం నుంచి డ్రాప్ కానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అయితే.. దిల్లీకి పోయి వచ్చాక మళ్ళీ ప్రకటిస్తానని జగ్గారెడ్డి చెబుతున్నారు. అంటే మొత్తానికి జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి పది రోజులు గడువు ఇచ్చారన్నమాట. ఈ  పది రోజుల్లో ఆయన్ను సంతృప్తి పరిచేలా చర్యలు ఉంటే సరి..లేకంటే జగ్గారెడ్డి జంపింగే అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: