ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆప్ 2014 ఎన్నిక‌ల్లోనే తెలంగాణ‌లో కొన్ని స్థానాల్లో పోటీ చేసింది. ఇక ఇప్పుడు ఏపీలో కూడా పోటీకి రెడీ అవుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆప్ ముఖ్యంగా ఏపీలో ఉన్న ప‌ట్ట‌ణ ప్రాంతాలు, న‌గ‌ర ప్రాంతాల‌నే టార్గెట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఆప్ త‌ర‌పున పోటీ చేసేందుకు మంచి ఉత్సాహం తో పాటు ఎలాంటి వివాదాలు లేకుండా, క్లీన్ చీట్ ఉన్న యువ‌కులు రెడీ అవుతున్న‌ట్టుగా కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ మేర‌కు కొంద‌రు యువ‌కులు ఓ టీం గా ఏర్ప‌డి ఢిల్లీ ఆప్ అధిష్టానంతో ట‌చ్ లోకి కూడా వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆప్ సంచ‌ల‌న విజ‌యాలు సాధించింది. ఢిల్లీలో వ‌రుస‌గా రెండోసారి ఆప్ సాధించిన ఘ‌న‌విజ‌యం దేశానికి ఆప్ ను రోల్ మోడ‌ల్‌ను చేసేసింది. కేజ్రీవాల్ నాయ‌క‌త్వంలో ఢిల్లీ లో ఆద‌ర్శ‌వంత‌మైన పాల‌న అందిస్తూ యువ‌త‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇక ఢిల్లీ స్టార్ట్ అయిన ఆప్ ప్ర‌స్తానం ఇప్పుడు పంజాబ్ వ‌ర‌కు పాకేసింది.

పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. గోవాలో కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌తో నువ్వానేనా అన్న‌ట్టు ఢీకొంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఏదేమైనా ఆప్ ఢిల్లీ దాటుకుని ఇత‌ర ప్రాంతాల్లోనూ చాప‌కింద నీరులా దూసుకు పోతోంది. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మార్చి 10న వెల్ల‌డి అవుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఆప్ ప్ర‌భావం చూపితే వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో దేశంలో చాలా ప్రాంతాల్లో ఆప్ ఖ‌చ్చితంగా మ‌రింత ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు.

కేజ్రీవాల్ ఆద‌ర్శ వంతమైన పాల‌న‌కు ఎట్రాక్ట్ అవుతోన్న యువ‌త వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఏపీలో తిరుప‌తి - నెల్లూరు - విజ‌య‌వాడ - రాజ‌మండ్రి - గుంటూరు త‌దిత‌ర ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్రాంతాల్లో పోటీ చేయాల‌ని ప్లాన్ చేసుకుంటోంది. ఇక్క‌డ ఆప్ పోటీ చేస్తే ప్ర‌ధాన పార్టీల ఓట్లు ఖ‌చ్చితంగా చీలిపోతాయి. విద్యావంతులు, మేథావులు, ఉన్న‌త వ‌ర్గాల వారు ఖచ్చితంగా ఆప్‌కే ఓట్లు వేస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

AAP