చిన్న‌పామునైనా.. పెద్ద క‌ర్ర‌తో కొట్టాల‌ని అంటారు పెద్ద‌లు. అదేవిధంగా ల‌క్ష్యం పెద్ద‌దిగా ఉన్న‌ప్పుడు.. మ‌రింతగా క‌ష్ట‌ప‌డాలి. మ‌రింత‌గా ల‌క్ష్య సాధ‌న‌కు కృషి చేయాలి. కానీ, ఈ త‌ర‌హా వ్యూహం.. జ‌న‌సేన‌లో లోపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌గ్గాలుచేప‌ట్టాల‌ని.. ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పిలుపునిచ్చారు. యువ‌త‌ను స‌మీక‌రిస్తాన‌ని అన్నా రు. యువ‌త‌ను ముందుండి న‌డిపిస్తాన‌ని కూడా చెప్పారు.

అయితే.. ఇవి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా మాట‌లు గానే మిగిలిపోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చేత‌ల రూపంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేదు. దీనిపైనే మేధావులు సైతం దృష్టి పెట్టారు. ప్ర‌స్తుతం ఉన్న మూడు కీల‌క పార్టీల‌ను చూసుకుంటే.. టీడీపీ, వైసీపీలు.. యువ‌త వైపే అడుగులువేస్తున్నాయి. ఈ క్ర‌మంలో జ‌న‌సేన కూడాయువ జ‌పం చేస్తోంది. బాగానే ఉంది. కానీ.. జిల్లాల్లో యువ‌త‌ను ముందుండి న‌డిపించే నాయ‌కులు ఏరీ.. దీనికి సంబంధించిన వ్యూహం ఏంటి?  యువ‌త‌ను ఏవిధంగా ముందుకు న‌డిపిస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

అంతేకాదు.. బూత్ స్థాయిలో క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకోవాలి.. మండ‌ల స్థాయిలో నాయ‌కుల‌ను త‌యారు చేసుకోవా లి.. అదేవిధంగా న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల స్థాయిలో వార్డుల్లో పార్టీని బ‌లోపేతం చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక‌.. వారిని మ‌రింత వేగంతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాలి. ఇదీ.. ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు అనుస‌రించాల్సిన వ్యూహం. కానీ.. జ‌న‌సేన‌లో ఎక్క‌డా బూత్ లెవిల్ క‌మిటీలు లేవు. అంతేకాదు.. మండ‌ల‌, గ్రామ స్థాయి క‌మిటీలు కూడా క‌నిపించ‌డం లేదు.

దీనిని బ‌ట్టి.. పార్టీ ఏవిధంగా ముందుకు సాగుతుంద‌నేది ప్ర‌శ్న. ల‌క్ష్యం మంచిదే అయినా.. దానిని సాధించుకునేందుకు అనుస‌రించాల్సిన వ్యూహాన్ని కూడా అదే రేంజ్‌లో అమ‌లు చేయాలిక‌దా.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ చెప్పిన ఏదీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లుకు నోచుకోలేదు. ఇలా అయితే.. ముందుకు సాగేనా..అనేది పార్టీలోనూ వినిపిస్తున్న గుస‌గుస‌. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: