వైసీపీ నేత, ఏపీ పర్యాటక మంత్రి రోజా.. జోరుగా హుషారుగా కనిపిస్తున్నారు. పర్యాటక మంత్రిగా నిన్న విజయవాడలో పర్యటించిన ఆమె.. అక్కడి టూరిజనం ఏర్పాట్ల గురించి వివరించారు. స్వయంగా ఆమె ఆ ప్రాంతమంతా కలియ తిరిగారు. గతంలో జరిగిన ఒక బోటు ప్రమాదం వల్ల పర్యాటకులకు ఇబ్బంది పడ్డారని అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి జగన్ గట్టి చర్యలు తీసుకున్నారని పర్యాటక శాఖ మంత్రి రోజా చెబుతున్నారు.


విజయవాడ కృష్ణా నదిలో బోధిసిరి బోటును పునప్రారంభం చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా బోధిసిరి బోట్ ప్రారంభించటం తనకు చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఇకపై పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని, పర్యాటకానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారని మంత్రి రోజా చెబుతున్నారు. రాష్ట్రంలో ఏపీ పర్యాటకానికి సంబంధించి 45బోట్లు, ప్రైవేట్ వి 25 బోట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి రోజా అన్నారు.


విజయవాడలోని కృష్ణా తీరంలో తొమ్మిది ప్రాంతాల్లో  కంట్రోల్ రూమ్ ద్వారా బోట్లని పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి రోజా పేర్కొన్నారు. కోవిడ్ వల్ల టూరిజం ఆదాయ తగ్గిందన్న రోజా.. పాపికొండలకు బోటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. రోప్‌  వేస్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న  స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ భార్గవ వెల్లడించారు. రెండు రోప్ వేస్ పనులను  త్వరలోనే ప్రారంభిస్తామని వివరించారు.


ఈ కార్యక్రమంలో మంత్రి రోజా ఆద్యంతం హుషారుగా కనిపించారు. పర్యాటక శాఖకు చెందిన బ్యాటరీ కారులో ఆమె ఆ ప్రాంతం అంతా కలియ తిరిగారు. ప్రెస్ మీట్ సమయంలో సేఫ్టీ బెల్టుల ప్రాధ్యానం గురించి చెబుతూ.. ఆమె స్వయంగా వాటిని ధరించి ప్రెస్ మీట్‌ కంటిన్యూ చేశారు. మొత్తానికి ఈ కార్యక్రమంలో రోజా చాలా హుషారుగా జోష్‌గా పాల్గొన్నారు. తనకు కేటాయించిన శాఖ పట్ల ఆమె అంత సంతృప్తిగా వార్తలు వచ్చినా.. అలాంటి ఛాయలేమీ ఆమె ముఖంలో కనిపించనే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: