ఏపీలో ఎలాగైనా బలపడాలని భావిస్తున్న బీజేపీ కొత్త నినాదాలు వెదుక్కుంటోంది. ఏపీలో హిందువులను ఆకట్టుకునేందుకు కొత్త ప్రచారాలకు యత్నిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త డైలాగ్ పట్టేసింది.. అదే జిన్నా కావాలా? అబ్దుల్ కలాం కావాలా? ఈ డైలాగ్‌ను సోము వీర్రాజు పదే పదే మీడియా ముందు.. వేదికలపై వల్లె వేస్తున్నారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వ చర్యలు, విచారణ ముందుకు సాగటం లేదంటూ హిందువులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.


బీజేపీ ఎప్పుటి నుంచో ఉన్న జిన్నా టవర్ పేరు మార్చాలని మనం ఉద్యమం చేస్తోందని కానీ.. ఫలితం వెంటనే రాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అంటున్నారు. రామజన్మబూమి కోసం ఎన్నాళ్లు ఉద్యమం చేసామో గుర్తు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. బాబర్ కావాలా రాముడు కావాలా అంటే రాముడే కావాలని అంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గుర్తు చేశారు.


ఇప్పుడు గుంటూరులో కూడా జిన్నా కావాలా అబ్దుల్ కలాం పేరు కావాలో తేల్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సూచించారు. తిరుమల విషయంలో ప్రభుత్వ  వైఖరిని సోము వీర్రాజు తప్పుబడుతున్నారు. గుంటూరులో జరిగిన బీజేపీ ప్రాంతీయ సమావేశంలో సోము వీర్రాజు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బీజేపీ మాత్రమే నడుపుడుందని.. త్వరలో ఏపీ రాజకీయాల్ని కూడా బీజేపీ నడుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.


బీజేపీ ముందు ఎవరి తమాషాలు నడవవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అయితే.. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లటంలో ముందుండాలని ఆయన నేతలకు సూచించారు. అంతర్వేది రథం కాలిపోవడం, రామతీర్దంలో రాముడి విగ్రహాన్ని నరికేసిన ఘటనల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో ఉద్యమం చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలపై విచారణ కూడా సరిగా జరగటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: