తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయానికి కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. దిల్లీ మద్యం స్కామ్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారుతోంది. దీంతో కవితకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. పంజాబ్ ఎన్నికల కోసం ఆప్ కు కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారనే ప్రచారం జరుగుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  కొత్త అంశం తెరపైకి తెచ్చారు.


పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే.. "బీజేపీ చర్యలను ప్రతి పౌరుడు ఖండించాలి.. ఢిల్లీ లో లిక్కర్ స్కాం జరిగిందని... కవిత ఆ స్కాం లో ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి.. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కు ఆర్థిక సహాయం చేశారనే ప్రచారం జరుగుతోంది.. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న నేతలను కేజ్రీవాల్ కలువరని మేం భావించాం.. కానీ ఏం జరిగిందో ఏమో కానీ కేసిఆర్ వెళ్లి కేజ్రీవాల్ ను కలిశారు.. పంజాబ్ కు ఆయన తో కలిసి వెళ్లారు.. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో వివిధ పార్టీలకు వందలాది కోట్లు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.


ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ దీంట్లో నిజా నిజాలు తేల్చాల్సిన భాధ్యత కేంద్రం పై ఉంది. కేసిఆర్ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తే వారి ఇళ్లలో సోదాలు ఎందుకు జరగడం లేదు.. విచారణ సంస్థలు కేసిఆర్ ఆయన కుటుంబ సభ్యుల పాత్రపై ఎందుకు స్పందించడం లేదు.. 30సంస్థల్లో సోదాలు జరిగాయి.. కేసిఆర్ కుటుంబ సభ్యుల ఇళ్ల పై ఎందుకు జరగడం లేదు..వారు ఆధారాలు మాయం చేసే ప్రమాదం లేదా.. ఎందుకు కేసిఆర్ కుటుంబానికి ఆ అవకాశం ఇస్తున్నారు.. మీరే ఆరోపణలు చేస్తున్నారు. మీరే అధికారంలో ఉన్నారు.. అయినా వారి ఇళ్ల లో ఎందుకు సోదాలు జరగలేదు.. దీని వెనుక ఉన్న లాలూచీ ఏంటి అని ప్రశ్నించారు.


ఫినిక్స్, సుమధర, వాసవి కంపెనీ ల పై దాడులు ఎందుకు ధృవీకరించలేదన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ప్రతీ ఎన్నికలప్పుడు భయపెట్టి లొంగదీసుకోవడం బీజేపీకి అలవాటన్నారు. గతంలో 142కోట్ల నగదు దొరికిన హెటరో కేసును ఈడీ, సిబిఐకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ సంస్థల దాడుల్లో దొరికిన సమాచారం బయట పెట్టాలన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. సిబిఐ, ఈడి ఎన్నికలు నిర్వహించే బీజేపీ అనుబంధ విభాగాలుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: