మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్ అధ్యక్ష।  పదవి రేసులో ఉన్నవాడు..  దక్షిణాది నేత.. కన్నడ రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు.. అందులోనూ దళితుడు.. అధిష్టానానికి దగ్గరి వాడు. నమ్మకస్తుడు.. ఇంతకు మించి ఆ పదవికి అర్హతలు ఏం కావాలి.. అయితే.. మల్లికార్జున ఖర్గే గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఆయనే చెబుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి వచ్చి ఖర్గే.. అనేక విషయాలు మీడియాతో పంచుకున్నారు.  


తన తల్లి, సోదరుడు, సోదరిను రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో కొల్పోయానని మల్లిఖార్జున ఖర్గే ఆవేదన వ్యక్తంచేశారు.  రాహుల్ చేసేది భారత్ జోడో యాత్రేనని, కుల, మతాల వారీగా భాజపా దేశాన్ని విభజిస్తోందని మండిపడ్డారు.  సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఏఐసీసీ అధ్యక్షులుగా ఉండడానికి నిరాకరించడంతో ఎన్నిక అనివార్యమైందని మల్లిఖార్జున ఖర్గే తెలిపారు.  అధ్యక్ష స్థానంలో గాంధీ కుటుంబం వ్యక్తులు లేకపోవడం బాధాకరమని మల్లిఖార్జున ఖర్గే  వాపోయారు. అందరి సూచనల మేరకు అధ్యక్ష స్థానానికి అభ్యర్థిగా నిలిచానన్న మల్లిఖార్జున ఖర్గే.. ఏపీ నుంచి వచ్చిన వాళ్లు దేశాన్ని నిర్దేశనం చేశారని గుర్తుచేశారు.


కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేసే అరుదైన అవకాశం తనకు వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే ఆనందపడుతున్నారు. తను ఇప్పటికే పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్నానని, సుదీర్ఘ కాలంపాటు కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం చేశానని మల్లిఖార్జున ఖర్గే  తెలిపారు.  2009లో సోనియా గాంధీ సూచనల మేరకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశానని మల్లిఖార్జున ఖర్గే  అన్నారు.  కేంద్ర కార్మిక శాఖ, సోషల్ జస్టిస్ మంత్రిగా చేశానని మల్లిఖార్జున ఖర్గే వివరించారు.  బీజేపీ, ఆరెస్సెస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే బలం తనకివ్వాలని మల్లిఖార్జున ఖర్గే కోరారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేస్తానని, వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లను 50 ఏళ్ల వయసులోపు వారికే ఇస్తామని మల్లిఖార్జున ఖర్గే అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: