ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కేంద్రం కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కూడా తగిన చర్యలు చేపడుతున్నాయి. ఏపీలో రాష్ట్రంలో  కోవిడ్ పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్యాధికారులు తో  కోవిడ్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని.. కోవిడ్ పై అందరూ అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించారు. ఒమిక్రాన్ బిఎఫ్ 7 తీవ్రత ఎలా వున్నా ఎదుర్కొనే పరిస్థితులు అంశం పై సమీక్ష నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.


రాష్ట్రంలోని ప్రతి హెల్త్  సెంటర్ లో రాపిడ్ టెస్ట్ లు నిర్వహించేలా కిట్స్ సిద్ధం చేస్తున్నామని.. గతంలో కోవిడ్ కంట్రోల్ లో ఏపీ రోల్ మోడల్ గా నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. కొత్త వేరియంట్ వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని.. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్  చేస్తామని.. ఇందుకు రాష్ట్రంలో 29 లాబ్స్ ఉన్నాయని మంత్రి విడదల రజని తెలిపారు.
వాలంటీర్ వ్యవస్థను కోవిడ్ నియంత్రణలో వాడుకుంటామన్న మంత్రి విడదల రజని..  అన్ని హాస్పటల్ ను అలెర్ట్ చేశామన్నారు.


ఆక్సిజన్ సరఫరా ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి విడదల రజని తెలిపారు. ఈ కొత్త వేరియంట్ కొన్ని రాష్ట్రాలు నమోదు అయ్యాయని.. అయినంత మాత్రాన ఆందోళన అవసరం లేదని మంత్రి విడదల రజని భరోసా ఇచ్చారు. అయితే.. ఎవరూ అజాగ్రత్తగా ఉండవద్దని.. పిపిఈ కిట్స్, మాస్క్, శానిటర్లు  కొరత లేకుండా చూస్తామని మంత్రి విడదల రజని అన్నారు. చలికాలంలో కోవిడ్ వ్యాపి చెందే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని.. అనవసరంగా ఎవరూ భయపడవద్దని మంత్రి విడదల రజని సూచించారు. ఏదేమైనా మళ్లీ కరోనా కాలం వచ్చింది. జాగ్రత్తగా ఉండటం బెటర్.  

మరింత సమాచారం తెలుసుకోండి: