ప్రతి ఒక్కరికి హిందువులను హిందూ సమాజాన్ని హిందూ దేవుళ్లను విమర్శించడం అలవాటైపోయింది. ఇదే విధంగా బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్ప స్వామి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ తరుణంలో తెలంగాణలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బైరి నరేష్ ని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు డిమాండ్ చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. హిందూ  సమాజం పూజించే దేవుడిపై మాటల్లో చెప్పలేని విధంగా దూషించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పట్టుబట్టారు.


ఇక్కడ ఎలాంటి రాజకీయ పార్టీలు, ఆరెస్సెస్, ప్రమేయం లేకుండానే ప్రజల్లో వచ్చిన చైతన్యమిది. ఎంతలా అంటే నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసుల్ని అడ్డుకుని మరి దాడి చేశారు. దీక్షలో ఉన్న స్వాములు సైతం ఆగ్రహం చెంది దాడికి దిగారు. సదరు వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తప్పించుకొని పోలీస్ స్టేషన్లో తలుపులు మూసేసి దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహుజన వాదులు మాట్లాడుతూ.. బైరి నరేష్ వ్యాఖ్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అయినా మన మతాన్ని ఆచరించాలి. పరమతాన్ని గౌరవించాలి. అంతే కాని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే రోజులు పోయాయని ఈ సంఘటనతో స్పష్టం అవుతోంది.


హిందూ దేవుళ్లను దూషించే వారికి కించపరిచే వారికి ఇది ఒక చెంపపెట్టు లాంటిది. మళ్లీ మా దేవుళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదని అయ్యప్ప స్వాములు హిందూ సంఘాలు తీవ్ర హెచ్చరికలు చేశారు.  అయ్యప్ప మాల అంటేనే హరిషడ్వర్గాలను విడిచిపెట్టి శాంతి సహనం ఓపికతో 41 రోజులు మాలధారణతో ఉండే అయ్యప్ప స్వాములు సైతం దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అతడు ఎలాంటి వ్యాఖ్యలు  చేశాడో అర్థం చేసుకోవచ్చు.నాస్తికులు నాస్తికులు లాగా ఉండాలని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని అయ్యప్ప స్వాములు హెచ్చరించారు. మన వాదాన్ని మనం ఎంత బలంగా అయినా చెప్పుకోవచ్చు. కానీ ఇతరుల మనోభావాలు కించపరిచేలా మాట్లాడితే అందుకు తగ్గ పర్యవసానాలు మాత్రం ఇలాగే ఉంటాయని చెప్పక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: