రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఓ ప్రకటన చేశారు. అనూహ్యంగా ఉండే సినిమా తీస్తానని ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఏం నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనే వివరాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఊహతీతమైన విషయాలు ఏమి ఉండవు ఊహజనితమైనవే ఉంటాయి. రాంగోపాల్ వర్మ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక స్థాయికి వెళ్లిన తర్వాత ఏం చేయాలో తెలియక దిగజారుతున్న వైనం. మనిషి ఒక లక్ష్యం పెట్టుకున్నాక దాన్నిరీచ్ అయ్యాక ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటుందో రామ్ గోపాల్ వర్మ పరిస్థితి అది.


ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసి, ఎంతో పేరు సంపాదించుకున్న వర్మ ప్రస్తుతం పూర్తిగా దిగజారి బూతు సినిమాలు తీసే స్థాయికి పడిపోయాడు. ఇప్పుడు ఈయన తీసే సినిమాలు ఎవరూ చూడటం లేదు. దీంతో బ్లూ ఫిల్మ్ లు తీసే స్థాయికి దిగజారిపోయారు. ఈయన ఇంకెంత దిగజారడంటే అమ్మాయిల కాళ్లు నాకుతూ.. ఇదే నా నైజం అనడం పబ్లిసిటీ కోసం పాకులాడటం. తీసిన సినిమాలు ఆడకపోయే సరికి ఇలాంటి స్టంట్లు చేస్తున్నాడు. మళ్లీ ఇప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయాలపై సినిమా తీస్తానని అంటున్నాడు. అంతేందుకు తెలుగుదేశం పోయిన సారి ఎన్నికల్లో కథానాయకుడు సినిమాతో ఎన్టీఆర్ చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అయినా ఏం జరిగింది.


ఎవరో సినిమా తీస్తే దాన్ని చూసి ఓట్లు వేసే రోజులు మారిపోయాయి. లక్షీస్ ఎన్టీఆర్ అని ఇదే వర్మ సినిమా తీశారు. ఈ సినిమా వల్ల లక్షీ పార్వతి ఎమ్మెల్యే అయ్యారా, మంత్రి అయ్యారా.. అదేం కాదు కదా ఎవరినో ప్రలోభాపెట్టాలనుకుంటే ఎవరూ ప్రభావితం అయ్యే రోజులు కావు. ప్రస్తుతం ప్రజలు ఆలోచిస్తున్నారు. దాన్ని ఆచరణలో పెడుతున్నారు. మరి రాంగోపాల్ వర్మ తీసే సినిమా హిట్ అవుతుందా. ప్లాఫ్ అవుతుందా వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

RGV