
ఇది ఇలా ఉంటే పవన్ సీఎం అయితే టిడిపిలో చంద్రబాబు నాయుడు ఏం కావాలి మరి దీనికి తెదేపా కార్యకర్తలు గాని తెదేపా నాయకులు గాని అసలు సిద్ధంగా లేరు. అయినా పవన్ కళ్యాణ్ ని సీఎంగా ఎలా ఊహించుకుంటారు. గత సాధారణ ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కళ్యాణ్ ని ఏకంగా సీఎం చేయాలని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. అందులో తప్పులేదు కార్యకర్తలు కాబట్టి పవన్ అంటే ఎనలేని అభిమానం ఉంటుంది. కాబట్టి సీఎం అభ్యర్థి అనుకోవడంలో ఎలాంటి తప్పులేదు.
కానీ దీనికి తెదేపాతో పొత్తు పెట్టుకుని తెదేపాని వాడుకొని పవన్ ని సీఎం గా చేయాలని అనుకోవడం పవన్ సీఎం అవుతాడని కలలు కంటున్నారు. పవని సీఎం అయితేనే టీడీపీతో పొత్తుకు సిద్ధమని జనసేన కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు సీఎం అయితేనే తెదేపాకు లాభం అదేవిధంగా ఆంద్రప్రదేశ్ కి లాభం కాబట్టి ఆ కార్యకర్తలు ఏమాత్రం ఈ విషయాన్ని అంగీకరించే పరిస్థితిలో లేరు. మరి ఉండవల్లి ఏ ఉద్దేశంతో పవన్ సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నారు. చివరికి పవన్ జనసేన పార్టీ, తెదేపా ఎలాంటి ఎత్తులతో రాబోయే ఎన్నికల్లో పాల్గొంటాయి చూడాలి.