చైనా తీరు మోసపూరితం అన్న విషయం తెలిసిందే. అది మూడు అడుగులు ఆక్రమించి ఒక అడుగు వెనక్కి వేస్తుంటుంది. భూమిని ఆక్రమించుకోవడం లేదంటూనే బపర్ జోన్ ని చైనా ఆక్రమించుకుంటుంది.  రేపో మాపో చైనా, భారత్ యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే భారత్ గజం భూమిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ విషయంలో తగ్గేది లేదంటుంది. చైనా ఎక్కడ మేం ఆక్రమించుకోవడం లేదంటూనే బపర్ జోన్ లను ఆక్రమించుకుంటోంది.


భారతదేశం భూభాగం కాదు అది బపర్ జోన్ అని వితండ వాదన చేస్తోందని ప్రధాని మోదీకి ఒక నివేదిక వచ్చింది. తూర్పు లడఖ్ లోని 65 గస్తీ పాయింట్లలో 25 పాయింట్లను ఇండియా కోల్పోయిందని అక్కడి పోలీసు అధికారి ఒకరు ప్రభుత్వానికి గత వారం నివేదిక ఇచ్చారని జాతీయ మీడియా సంస్థలు ఆయా కథనాల్లో తెలుపుతున్నాయి. కారకోరం పాస్ నుంచి ముమ్మూరు వరకు 65 పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి.


ఇందులో కొన్ని ప్రాంతాలకు మన గస్తీ దళాలు వెళ్లలేకపోతున్నాయని లేహ్ ఎస్పీ నిత్య కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదికను ఆమె డిల్లీలో ప్రధాని మోడీతో జరిగిన సదస్సులో అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. కొన్ని పాయింట్లలో భారత్ గస్తీ లేకపోవడంతో ఆ ప్రాంతాలను బపర్ జోన్ లుగా చూపుతూ వాటిని చైనా కలిపేసుకుంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు.


చైనా అంగుళం తర్వాత అంగుళం భూమిని ఆక్రమించే విధానాన్ని సలామీ స్లైసీ అంటారని నివేదిక వెల్లడించింది. ఎత్తైన పర్వతాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బపర్ జోన్ ప్రాంతాల్లో కి భారత్ గస్తీ దళాలు వెళ్లగానే అభ్యంతరం చెబుతోంది. చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేసే ప్రయత్నం చేస్తోందని భారత్ ఆరోపించిన నెలరోజులకే కాదు భారతే ఆక్రమించేస్తోందని చైనా ఆరోపణలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: