జగన్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆక్షేపించారు. అవ్వాతాతలకు 1 వతేదీనే పింఛన్లు అందించే ప్రభుత్వం... ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరైన అవ్వా తాతలకు మాత్రం పట్టించుకోవడం లేదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆరోపించారు. ఉద్యోగులకు 1 వ తేదీన జీతాలు తీసుకునే పరిస్ధితి పోయిందని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు.


ఉద్యోగులను సంక్షోభం లోకి నెట్టి ప్రజలకు సంక్షేమాన్ని ఎలా అమలు చేస్తారని బండి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే తొలుత సంతోషించామన్న బండి శ్రీనివాస్..వారి సమస్యలు పరిష్కరించకపోవడంతో వారు కష్టాలు పడుతున్నామన్నారు. విలీనం అనంతరం ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని బండి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఎ లు ఇంకా ఇవాల్సి ఉందని.. సంక్రాంతికి ఒక డీఎ ఇస్తామని సాక్ష్యాత్తూ సీఎం ఆదేశించినా ఇప్పటి వరకు దిక్కులేదని బండి శ్రీనివాస్ అన్నారు.  


ఏప్రిల్ లో అన్ని డీఎలు ఇస్తామంటున్నారని ...ఏ ఏప్రిల్ కు ఇస్తారో తెలియడం లేదని బండి శ్రీనివాస్ వ్యంగ్యంగా అంటున్నారు. ఇదిగో పులి వచ్చింది అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం  తీరు ఉందన్న బండి శ్రీనివాస్ సామ దాన దండోపాయాలతో ఉద్యోగులు  డిమాండ్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.  జగన్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన పీఆర్సీని  చరిత్రలో ఇప్పటి వరకు  చూడలేదని.. పీఆర్సీ అమలుతో   వేతనాలు ,డీఎ లు ,హెచ్ ఆర్ ఎ పెరగక పోగా తగ్గాయని... పిల్ల పెళ్లి చేసినపుడు జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేస్తే ఆ పిల్లలకు పిల్లలు పుట్టి  మనవరాలు పుట్టినా బారసాలకు కూడా జీపీఎఫ్ రావడం లేదని బండి శ్రీనివాస్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: