వ్యక్తిగత భావజాలాల్ని వ్యవస్థపై రుద్దకూడదు. కొంతమంది న్యాయమూర్తుల విషయంలో కేంద్రం చాలా రోజులుగా పట్టు బట్టింది. వారు న్యాయమూర్తులుగా పనికిరారు. వారికి వ్యక్తిగతంగా కొన్ని విషయాలు, మతపరమైన లేదా ఇతర అంశాలు నచ్చవు వారు న్యాయమూర్తులుగా అస్సలు పనికిరారనే భావనను కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తూ వచ్చింది. కానీ సుప్రీం కోర్టు కొలిజీయం ఆ అయిదుగురు న్యాయమూర్తులను నియమించాల్సిందేనని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.


గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అధికారులను, న్యాయస్థానాలను, వ్యవస్థలను గుప్పెట పెట్టుకుని పరిపాలన సాగించారని అంటుంటారు. అలా చేయడం వల్ల న్యాయవ్యవస్థ రాజకీయాలకు, రాజకీయ నాయకులకు భయపడుతోందనే భావన అప్పటి ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో నరేంద్ర మోడీ తాను మాత్రం  ప్రజాస్వామ్యయుతంగా పాలన చేసేందుకు మొగ్గు చూపుతున్నానంటున్నారు.  


వ్యక్తిగత భావజాలాల్ని ఇతర మతాల మనోభావాల్ని కించపరిచే లేదా విమర్శించే వ్యక్తులు న్యాయాన్ని ఎలా చెబుతారనేది ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం భావన. అయినా ఈ విషయంలో సుప్రీం కోర్టు తన పంతాన్ని నెగ్గించుకుంది. ఆ అయిదుగురు న్యాయమూర్తులను కచ్చితంగా నియమించాల్సిందేనని తెలిపింది. అయితే ఇదే సమయంలో వ్యక్తిగత అభిప్రాయాలు కోర్టుల్లో ఏ మాత్రం పనికిరావని తేల్చిచెప్పింది. దీనిపై ఒక రాజకీయ పార్టీతో అనుబంధం ఉన్న అయిదుగురి నియామకం పట్ల ప్రధాని తీవ్ర అసంతృప్తి తెలియజేశారు. అయినా సుప్రీంకోర్టు కొలిజీయం మాత్రం తగ్గలేదు.


వాళ్ల వ్యక్తిగతం ఇక్కడ పనిచేయదని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అన్నారు. కానీ వ్యక్తిగత భావజాలం ఎంతో కొంత పనిచేస్తుందన్నది మాత్రం నిజం. బెంచ్ పైకి ఎక్కేటప్పుడు ఎలాంటి విషయాలు బహిర్గతంగా మాట్లాడకూడదు. కానీ ఒక పార్టీని పొగుడుతూ.. మరో పార్టీని తిడుతూ ఒకరికి విధేయులుగా, మరొకరితో శత్రువులుగా ఉంటున్న వారు న్యాయం ఎలా చెప్పగలరని మోడీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. వారం రోజుల్లో ఆ అయిదుగురు న్యాయమూర్తులను నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అన్నట్టుగానే చేసింది కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: