బంగ్లాదేశ్ లో 14 హిందూ దేవాలయాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కానీ దాని గురించి ఎక్కడ కూడా ఒక్క న్యూస్ చానల్ లో కూడా ఇఫ్పటి వరకు వార్త రాలేదు. అదే కశ్మీర్ లో గానీ, ఉత్తరప్రదేశ్ లో గానీ మసీదులో చిన్న గొడవ జరిగితే పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తూ ఉంటాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించలేదు. పాకిస్థాన్ లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలను ఇప్పటికే కూల్చి వేశారు. అక్కడ అసలు గుడులు కనిపించని పరిస్థితి. ఇలా కూల్చి వేసిన హిందూ ఆలయాల గురించి ఒక్కరు మాట్లాడరు. కానీ బాబ్రీ మసీదు గురించి చర్చ కావాలన్న విమర్శలు వినిపిస్తుంటాయి.  


అన్ని మతాలు సమానమనే వారు, ప్రపంచంలో పరమతాన్ని అభిమానించాలి.. మన మతాన్ని ఆరాధించాలి అనే వారు సైతం హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా చూసీ చూడనట్లు వ్యవహారించడం పరిపాటిగా మారింది. ముస్లింలు మైనార్టీలుగా ఉన్న భారత్ లో మసీదు వద్ద చిన్న గొడవ జరిగినా దాన్ని రచ్చ రచ్చ చేస్తాయి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు. కానీ పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో హిందువులపై, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై ఏ ఒక్కరూ స్పందించరు.


బంగ్లాదేశ్ లోని డాకుర్ గావ్ రీజియన్ పరిధిలో ఉన్న 14 ఆలయాలను ఈ నెల 5న గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై ఆయా దేశాలు ఎందుకు స్పందించడం లేదు.  ఒక మత విశ్వాసాలపై దాడి చేసి వారిని భయాందోళనకు గురిచేసి అక్కడ హింసను ప్రేరేపించి మత మార్పిడిలు చేయడం లక్ష్యం. మతం మారితే ఓకే లేకపోతే విద్వంసం కాండ. భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయినపుడు పాక్ లో ఎంత మంది హిందువులు ఉండేవారు ఎన్ని హిందూ దేవాలయాలు ఉండేవి. ప్రస్తుతం అక్కడ హిందువులు మైనార్టీలుగా బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితికి ఇలాంటి దాడులే కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: