భారత్ లో ప్రత్యేక సిక్కు దేశం కావాలనే ప్రతిపాదన, సిక్ ఫర్ జస్టిస్ అనే నినాదంతో గతంలో ఉద్యమాలు జరిగాయి. అయితే ఆ తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ అనే దానితో ఆ నినాదాన్ని ఇండియా ఆపగలిగింది. అనంతరం కొంతమంది ప్రత్యేక దేశం కావాలనుకునే వారు దేశం విడిచి పారిపోయారు. అందులో ఎక్కువ మంది కెనడాలో స్థిరపడ్డారు. దాదాపు ప్రస్తుతం కెనడాలో 5 లక్షల మంది సిక్కు ఓటర్లు ఉన్నారు. దాదాపు 1.4 ఓట్లు సిక్కులకు ఉన్నాయి. దీంతో అక్కడ 2018 లో జరిగిన ఎన్నికల్లో 18 మంది చట్ట సభలకు ఎన్నికయ్యారు.


ఇప్పటికీ ఇండియాకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు చేయడం పరిపాటి. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో కూడా ఇండియా పర్యటనకు వచ్చినపుడు ప్రత్యేక సిక్కు దేశం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కెనడాలో గెలిచిన ఈ 18 మందిలో నలుగురు మంత్రులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు గెలిచిన నలుగురు మంత్రుల్లో ఒక విదేశాంగ మంత్రి భారత్ కు రానున్నాడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది.


ఇప్పటికే పాక్, చైనాతో సరిహద్దు విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రధానిగా ఉన్న జస్టిస్ ట్రూడో ఇక్కడి సిక్కు సంతతికి చెందిన వారు. రెపరెండం, రైతు ఉద్యమం, యాంటీ ఇండియాకు చెందిన వాటిలో కెనడా ప్రభుత్వం ఎక్కువగా చేస్తోంది. ప్రస్తుతం ఇండియాకు వచ్చిన కెనడా విదేశాంగ మంత్రి భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తో భేటీ కానున్నారు. ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.


ఇక్కడ ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్నఉద్యమాలకు సంబంధించి ఎక్కవగా కెనడాలోనే వీటిని జరపడానికి నిధులు వస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని ఆపాలని ఇండియా కోరుతోంది. మరి కెనడా, భారత్ ల విదేశాంగ మంత్రుల మీటింగ్ లో ఎలాంటి అంశాలు మాట్లాడనున్నారు. దేశంపై వ్యతిరేకంగా చేస్తున్న చర్యలకు కెనడా ఏం చెప్పాలనుకుంటోంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: