ప్రభుత్వానికి సినిమాలకు సంబంధించిన ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక భాగాన్ని ఇస్తుంటుంది. షూటింగ్ దగ్గర నుంచి అంతా కూడా హైదరాబాదులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో, చంద్రబాబుకు సినీ రంగంతో ఉన్న పరిచయాల మీదన వాళ్ళు అడగ్గానే ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలకి, టిక్కెట్ల రేట్లు కూడా ఎంత కావాలంటే అంత పెట్టుకోమని పర్మిషన్ ఇస్తూ ఉండేవారు.  


అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాక సినిమా వాళ్ళ  టిక్కెట్లు రేట్లు బాగా తగ్గించడం ఇంకా సినిమా థియేటర్ల విషయం లోనూ, షోలు విషయం లోనూ, ఇలా  రకరకాల వివాదాల తర్వాత సినిమా టికెట్ల రేట్లు అదనంగా పెంచుకోవాలి అనుకుంటే రెండు పద్ధతులు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కండిషన్స్ పెట్టారు. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా కనీసం 20 శాతం షూటింగ్ జరగాలి. రెండవది 100 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ కాకుండా బడ్జెట్ అయి ఉండాలి.‌


ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆంధ్ర ప్రదేశ్ కి రావాలి, ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ జరుపుకోవాలి అని. దాని కోసం సామ, దాన, భేద, దండోపాయాలలో భేదోపాయాన్ని ఉపయోగించారు. భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తమ షూటింగ్ జరుపుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసి ఆల్రెడీ కొన్ని జరుపుకున్నాయి, మరికొన్ని షూటింగ్ లలో ఉన్నాయి.


ఇంకా చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖలో ఎక్కువగా షూటింగులు జరుపుకుంటున్నారంటున్నారు సినీ పరిశీలకులు. మొన్న బన్నీ వచ్చి పది రోజులు ఇక్కడ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటే, ఆ తర్వాత  రామ్ చరణ్ వచ్చి 6,7 రోజులు విశాఖపట్నంలోనూ, రెండు రోజులు కర్నూలు లోనూ షూటింగ్ జరుపుకోవడం జరిగింది.
కేవలం హైదరాబాదులో ఏ రామోజీ ఫిలిం సిటీ లోనో, అన్నపూర్ణ స్టూడియోలోనో సెట్స్ వేసుకుని షూటింగ్ జరుపుకునే రోజులు తగ్గిపోతున్నాయి.ఈ నిర్భంద ధోరణితో ఈ  మధ్యకాలంలో 10, 12 సినిమాలు ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ జరుపుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: