భారత దేశం నుండి విదేశాలకు, ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో వెళ్లి అక్కడ వీసాలతో ముందు ప్రారంభించి, సెటిల్ అయిపోయిన తర్వాత గ్రీన్ కార్డు లాంటివి రావడం, లేకపోతే అక్కడ పౌరసత్వానికి అవకాశం వస్తే మన దేశ పౌరసత్వం వదులుకుంటున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఆ లెక్కలు చూస్తే గత ఏడాది 2.25 లక్షల మంది ప్రజలు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత 15 ఏళ్లలో ఇది గరిష్ట స్థాయిలో జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది.


2011 నుంచి 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. గత ఏడాది అత్యధికంగా 2,25,620 మంది, 2020లో అత్యల్పంగా 85,256 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు కూడా ఎందుకంటే కరోనా కారణంగా అక్కడ అవకాశం ఇవ్వకపోవడం వల్ల భారత పౌరసత్వాన్ని వీడినట్లు ప్రకటించింది.


ఈ పౌరసత్వం విషయం మీద రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి జైశంకర్ సమాధానం ఇచ్చారు. ఏడాది వారీగా పౌరసత్వం వదులుకున్న భారతీయుల సంఖ్య కూడా ఆయన వివరించారు.  ఆయన చెప్పిన విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2011లో 1,22,819 మంది, 2012లో 1,20,923 మంది, 2013లో 1,31,405 మంది, 2014లో 1,29,328 మంది, 2015లో 1,31,489 మంది, 2016లో 1,41,603 మంది, 2017లో  1,33,043 మంది, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,517 మంది, 2020లో 85,256 మంది, 2021లో  1,63,370 మంది, పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని  మంత్రి జయశంకర్ వెల్లడించారు.


2022 లో ఈ సంఖ్య 2,25,625కు పెరిగింది అన్నటువంటిది  అధికారిక లెక్క చెప్తుంది. మొత్తానికి ఇప్పుడైతే దేశం మీద అభిమానం విషయం పక్కనపెట్టి మరీ చాలామంది జనాలు  తమ తమ జీవితాల కోసం పరాయి దేశపు వారసత్వాన్ని కూడా కోరుకుంటున్నారని తెలుస్తుంది. దేశం ఋణం తీర్చుకోవడం అంటే ఇదేనా అన్న విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: