ఏపీ రుణాలు 4.42 లక్షల కోట్లుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీని ఆధారంగా అనేక మీడియాల్లో అనేక కథనాలు వచ్చాయి. ఇక ఇలాంటి వివరాలు వస్తే తెలుగుదేశం అనుకూల మీడియా ఊరుకుంటుందా.. కథనాలతో రెచ్చిపోయింది. దీంతో అసలు ఏపీ అప్పుల కథ ఏంటి.. వాస్తవాలు ఏంటి అనే అంశాలపై ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ వివరింగా తెలిపారు.


ఏపీ అప్పుల రెట్టింపు అయ్యాయని ఈ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ చేశారు. 2019 ఏప్రిల్ లో తెదేపా ఒక్కరోజు లోనే 5 వేల కోట్లు అప్పు చేసిందని ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ  తెలిపారు. విభజన సమయం నుంచి తెదేపా హయాంలో 2.24 రెట్లు రుణాలు పెరిగాయని ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ వెల్లడించారు. గతంలో 19 శాతం మేర రుణాలు పెరిగితే ఇప్పుడు కేవలం 13 శాతం మేర మాత్రమే పెరిగిందని  దువ్వూరి కృష్ణ తెలిపారు. ప్రజల పై అప్పుల భారం అని, ఇన్ని అపులు భవిష్యత్తు తరాలు తీర్చ లేని పరిస్థితిలో ఉన్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ నిరాధారమైనవని దువ్వూరి కృష్ణ  తెలిపారు.


ఎంతో క్లిష్ట మైన పరిస్థితులు ఉండి కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇంత తక్కువ అప్పులు చెయ్యడం కూడా ప్రశంసించాల్సిన ఆంశమని దువ్వూరి కృష్ణ  తెలిపారు. నిబంధనలకు లోబడి మాత్రమే ప్రస్తుత ప్రభుత్వం అప్పులు చేసిందని దువ్వూరి కృష్ణ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాల అప్పులు కూడా పెరిగాయని.. అయినా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 9.61 లక్షల కోట్లు అప్పు ఎక్కడ్నుంచి వచ్చిందో ప్రతిపక్షాలు చెప్పాలని దువ్వూరి కృష్ణ ప్రశ్నించారు.


గతంలో నూ నాన్ గ్యారెంటీ లోన్స్ ఉన్నాయని... ఇప్పుడే ప్రత్యేకించి వాటి గురించి కొందరు ప్రచారం చేయాల్సిన అవసరం ఏమిట.. పెండింగ్ బిల్లులు 1.85 లక్షలు కోట్లు ఉన్నాయని ఆరోపిస్తున్నారని... పెండింగ్ బిల్లులు గురించి ఏ ప్రభుత్వమూ బయటకు చెప్పదని దువ్వూరి కృష్ణ  అన్నారు. గతంలో ఎవరైనా పెండింగ్ బిల్లులు గురించి వెల్లడించారా  అని దువ్వూరి కృష్ణ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: