జమ్మూ కాశ్మీర్ లో లడాఖ్ ఓ భాగం. ఇక్కడ కాశ్మీర్ లోయలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. జమ్మూలో హిందూవులు, ముస్లింలు ఉంటారు. లడాఖ్ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఒకప్పుడు టిబెట్ లో లడాఖ్ భాగమని దాన్ని చైనాకు ఇచ్చేయాలని డ్రాగన్ కంట్రీ కోరుతోంది. లడాఖ్ ను ప్రత్యేక ప్రాంతంగా కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.


కాశ్మీర్ లోయకు, లడాఖ్ కు భౌగోళిక పరంగా చాలా మార్పులు కనిపిస్తుంటాయి. లడాఖ్ లో షిన్ కున్ కనుమ కింద నాలుగు కిలోమీటర్ల మేర సొరంగ నిర్మాణానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ సొరంగం వల్ల చలికాలం, వేసవి కాలం అనే తేడా లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా అక్కడ పర్యటించేందుకు అనుకూలంగా ఉంటుంది.


అన్ని వేళల్లో రక్షణ దళాలు పంపాడానికి, ఆహారం, వారికి ఇతర సౌకర్యాలు చేకూర్చడానికి ఈ సొరంగం ఉపయోగపడుతుంది. అయితే లడాఖ్ ప్రాంతంలో చలికాలంలో వాతావరణం అసలు అనుకూలించదు. అక్కడ ఉన్న ప్రజలకు ఆహారం కూడా అందించలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా రక్షణ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని అధిగమించి అక్కడ భారత సైన్యం సరిగా విధులు నిర్వర్తించేందుకు ఈ సొరంగం ఎంతో సహాయపడుతుంది.


ఇది నిర్మాణం అయితే అన్ని కాలాల్లోనూ అక్కడ సైన్యం గస్తీ కాసేందుకు, శత్రువుతో సైతం పోరాడేందుకు  ఉపయోగ పడుతుంది. కాబట్టి కేంద్రం లడాఖ్ విషయంలో కఠినంగా ఉండేందుకు సిద్ధమవుతుంది. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న లడాఖ్ ను అక్కడి ప్రజల కోరిక మేరకు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సరికొత్త సమస్య ఎదురవుతోంది. చైనా లడాఖ్ ప్రాంతాన్ని టిబెట్ లో భాగమని దాని విషయంలో ఇండియా దేశ సరిహద్దు విషయాల్లో ఏ మాత్రం తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. మరి లడాఖ్ లో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: