ఆయుధ కర్మాగారాలలో యుద్దాల నిమిత్తం తయారుచేసిన ఆయుధాలు ఖాళీ అయిపోతుంటే ఇప్పుడు ఒక్కో దేశం దాని ప్రభావాన్ని చవి చూస్తున్నాయి. ప్రత్యేకించి అమెరికా, యూరప్, నాటో దేశాలు ఆ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు అదే బాటలో ఫ్రాన్స్ కూడా ప్రయాణిస్తుంది. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు సహాయం చేస్తున్నందువల్ల బహుశా ఫ్రాన్స్ కూడా ఆయుధాలు కొరతను ఎదుర్కొంటున్నదని తెలుస్తుంది.

ఇదే విషయాన్ని లె ఫిగరో వార్తా పత్రిక నివేదిస్తూ కీవ్ ప్రభుత్వానికి సైనిక సహాయం నేపథ్యంలో ఫ్రెంచ్ సాయుధ దళాలు ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్నాయని చెప్పింది. ఫ్రాన్స్‌లోని భూ బలగాలు హోవిట్జర్‌లు ఇంకా ఫిరంగులలో ఉపయోగించే 155 ఎమ్.ఎమ్ మందుగుండు సామగ్రి కొరతను  ఎదుర్కొంటున్నాయని ఒక నివేదికలో పేర్కొంది. ఫ్రెంచ్ న్యాయనిపుణులు జూలియన్ రెన్‌కోల్ & విన్సెంట్ బ్రూ ఆయుధాల రిజర్వ్ గురించి ఫిర్యాదు చేశారు. మందుగుండు సామగ్రి నిల్వలను తిరిగి అంచనా వేయడానికి గల కారణాలను వివరించారు.  


కీవ్ ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి పెరగాల్సిన ఆవశ్యకత ఉందని, NATO  సభ్య దేశాలను, అణు దేశాలను ఆయుధాల ఉత్పత్తిని పెంచమని ఒత్తిడిని పెంచింది. దేశం మధ్య యుద్ధాలు పెరుగుతున్న ఈ ఉద్రిక్త నేపథ్యంలో, యుద్ధాలు చేయడానికి చాలా దేశాల దగ్గర  ఒకపక్కన ఆయుధాలు లేవు కాబట్టి, నాటో తమ సభ్యత్వ అణు దేశాలకు మీ దగ్గర ఉన్న ఆయుధ కర్మాగారాలను తెరిచి ఆయుధాలు తయారు చేసుకోమని అడుగుతుంది.


ఇలా ఈ యుద్ధ వాతావరణం లో చాలా దేశాలలో ఆయుధాలు లేకపోవడంతో మళ్లీ తిరిగి ఆయుధాలను సరికొత్తగా, అవసరమైనంతగా ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎదురయింది. ఇక రష్యా సంగతి సరే సరి ఆయుధ నిలువల్లో మరియు యుద్ధ పరికరాల నిలువల్లో అది ప్రపంచ దేశాల అన్నింటికన్నా ముందంజలో ఉంది. దాని దగ్గర ఉన్న యుద్ధ పరికరాలు ఇంకా ఆయుధాలను చూసి చాలా దేశాలు రష్యా పై దాడి చేయడానికి చాలా వరకు భయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: