ఇప్పుడు ప్రపంచమంతా బెలూన్ల గొడవ బాగా పెరిగిపోయింది. మొన్న అమెరికా చైనా బెలూన్లని పేలిస్తే, చైనా మా ప్రాంతమైన టిబెట్ లాంటి ప్రదేశాల్లోకి వచ్చిన బెలూన్లను పేలుస్తామని ప్రకటించింది గాని ఇంకా పేల్చలేదు. ఈ గొడవలు ఇలా ఉండగా ఇప్పుడు రకరకాల ప్రదేశాల్లోకి రకరకాల బెలూన్లు వస్తున్నట్లుగా తెలుస్తుంది. 6 రష్యా బెలూన్లు ఉక్రెయిన్ మీదకి వస్తే పేల్చేసామని ఉక్రెయిన్ ప్రకటించింది.


తాజాగా భారతదేశంలోని పోర్టు బ్లెయర్ దగ్గర చైనాకు సంబంధించిన బెలూన్ ఒక దాన్ని చూసామని కొంతమంది చెప్తున్నారు. దాదాపుగా ఇప్పుడు అనేక దేశాల్లో ఈ బెలూన్ ల గొడవే నడుస్తుంది. రొమేనియా,ఇంకా మాల్డోవాలో కూడా ఇలాంటి బెలూన్లు కనిపించాయి. మాల్దోవ అయితే వీటికి భయపడి తన ఎయిర్ స్పేస్ ని కూడా మూసివేసింది. రొమేనియా అయితే ఈ బెలూన్ల కోసం యుద్ధ విమానాలను పంపించింది, అయినా వాటికి అక్కడ బెలూన్లు ఏమీ కనపడలేదు. దాంతో అది ఎయిర్ డిఫెన్స్ ని నాశనం చేసేందుకే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని ఒక ప్రకటన ద్వారా ఆరోపించింది.


మొత్తానికి ఈ బెలూన్స్ అనేవి ఒక పెద్ద ప్రమాదంలా  కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఈ బెలూన్లను రాడార్ రిఫ్లెక్టర్స్ కోసం, ఫేక్ టార్గెట్స్ సృష్టికోసం వాడుతున్నారని ఉక్రెయిన్ లాంటి వాళ్లు అనుమానిస్తున్నారు. రెండు ఫైటర్స్ జెట్స్ ని పంపినా కూడా బెలూన్స్ కనపడకపోవడానికి అదే కారణం అంటున్నారు. దీనిపై చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ నాటో తన సభ్యత్వ దేశాలను హెచ్చరించాడు. వాటిని శాటిలైట్స్ ద్వారా మానిటర్ చేయమని సూచించాడు.


చైనాకి సంబంధించిన హైనా అనే ప్రదేశంలో ఈ బెలూన్లను పంపడం కోసం 140 మీటర్ల లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేశారని ఈ బెలూన్లను చైనా అక్కడ నుండి లాంచ్ చేస్తుందన్న విషయం తాజాగా ప్రపంచానికి తెలిసింది. అక్కడ ఏకంగా ఒక హ్యాంగర్ ఏర్పాటు చేసుకుని చైనా వీటిని వదులుతుందన్న విషయం అయితే ఇప్పటికి స్పష్టం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: