అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ పర్యటనలో ఉండగానే రష్యా సైనిక విన్యాసాలను చేపట్టింది. ఉక్రెయిన్ లోని వివిధ ప్రాంతాల్లో బాంబులతో విరుచుకుపడింది. ప్రస్తుతం తైవాన్ లో అమెరికా ప్రతినిధులు, సెనెటర్లు ఉండగా చైనా తమ శక్తిని ప్రదర్శిస్తుంది. అయితే ఇదే సమయంలో జపాన్, దక్షిణ కొరియాల మధ్య ఉత్తర కొరియా రెండు క్షిపణులను ప్రయోగించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. బఫర్ జోన్ దాటి ఆ దేశం ప్రయోగాలు చేసింది. రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చెల్లెలు కిమ్ సూన్ చాంగ్ అధ్యక్షతన ఈ క్షిపణి ప్రయోగాలు చేసింది. కిమ్ పట్ల ఉన్న అభిమానమే ఈ క్షిపణి ప్రయోగం అని ప్రకటించారు.


దీనిపై అమెరికా అడిగిన ప్రశ్నకు ఉత్తర కొరియా సమాధానం చెబుతూ మా అణు శక్తి సామర్థ్యాలు తెలియజేసేందుకు ఈ క్షిపణులు ప్రయోగించినట్లు, అలాగే తమ అధ్యక్షుడు కిమ్ పట్ల ఉన్న ఆరాధన భావాన్ని తెలిపేందుకే అని చెప్పారు. ఉత్తర కొరియా ఇప్పుడు ప్రయోగించిన మిస్సైల్ దాదాపు 15 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది. వర్సన్ 17 అనే పేరుతో దీన్ని ప్రయోగించారు.


ఐసీవీఏం న్యూక్లియర్ వన్ వార్ హెడ్ అనేది ఎవరూ అంచనా కూడా వేయలేనంత పెద్ద  వెపన్ తమ వద్ద ఉందని ఉత్తర కొరియా చెబుతోంది. ఈ అణు, సైనిక విన్యాసాలను ఇక సహించేది లేదని జపాన్ పేర్కొంది. అమెరికా మాత్రం జపాన్, దక్షిణ కొరియాలకు మేము అండగా ఉంటామంటూ హామీ ఇస్తూనే ఉంది.  15 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించడమంటే అది కేవలం అమెరికాను టార్గెట్ చేస్తూ చేసిన పనేనని ఇందులో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. అమెరికా ఉత్తర కొరియాపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. జపాన్, దక్షిణ కొరియా పరిస్థితి ఎలా ఉండబోతుందనే ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం.


మరింత సమాచారం తెలుసుకోండి:

KIM