పవన్ కళ్యాణ్ సీఎం కావడం ఖాయమనే జనసేన వర్గాలు, హరిరామ జోగయ్య లాంటి వారు నమ్ముతున్నారు. కానీ ఏపీలో ఉన్న అసెంబ్లీ స్థానాలు 175 ఉన్నాయి. ఆ 175 స్థానాల్లో పోటీ పెట్టే విషయంలో  పవన్ ముందుకు సాగుతారా? లేక  పొత్తులతో కాలం వెళ్లదీస్తారా అనే ఊహగానాలు ఎక్కువగా వినబడుతున్నాయి.


గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి 2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తే 18 ఎమ్మెల్యే సీట్లలో గెలుపొందారు. అలాగే ఆ పార్టీకి 79 లక్షల ఓట్లు పోలయ్యాయి. మూడో స్థానంలో నిలిచినప్పటికీ అక్కడ పడిన ఓట్లు చాలా ఎక్కువ. పార్టీ పెట్టిన అతి కొద్ది రోజుల్లోనే అన్ని స్థానాల్లో గెలుపొందడం 79 లక్షల ఓట్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ప్రజారాజ్యం అభ్యర్థులు 34 సీట్లలో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. తెలంగాణలో తక్కువ ఓట్లు వచ్చినా ఆంధ్ర, రాయలసీమలో ప్రజారాజ్యం పార్టీకి 26.7 శాతం ఓట్లు వచ్చాయి.


పవన్ కల్యాణ్ కూడా పార్టీ పెట్టి దాదాపు 10 ఏళ్లకు దగ్గరకొస్తుంది. మరి పార్టీ సాధించిందేమిటీ ఒక్క ఎమ్మెల్యే స్థానం.. ఓట్లు కూడా ఆశించిన స్థాయిలో పడలేవు.  జనసేన పార్టీకి కిందటి సారి జరిగిన ఎన్నికల్లో కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 18 లక్షల ఓట్లు పోలయ్యాయి. మొన్నటి కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో జనసేనను ప్రజలు ఎక్కువగా నమ్మారు.  రాబోయే ఎన్నికల్లో పవన్ సీఎం కావాలనుకునే వారు వీటిన్నింటిని పరిగణలోకి తీసుకుని పక్కా ప్రణాళికతో ఎన్నికలకు పోవాలి.


చంద్రబాబు, వైఎస్, వైఎస్ జగన్ లాంటి సీఎంలను ఆంధ్రలో ప్రజలు చూసేశారు. వీళ్లందరి పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసు. మరి పవన్ ను సీఎంగా ప్రజలు చూడాలంటే ఏం చేయాలి. ప్రజల్లో సీఎంకు ప్రత్యామ్నాయం పవన్ మాత్రమే అని అనుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందనేది ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: