జర్మనీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. జర్మనీ ఛాన్స్ లర్ షోల్ప్ భారత పర్యటనకు వచ్చారు. రష్యా నుంచి డిజీల్, పెట్రోల్ రాకపోవడంతో అక్కడ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రజలు నాటో నుంచి బయటకు వచ్చేయాలని కోరుతున్నారు. ఉద్యోగాలు పోతున్నాయి. ఆయుధాలను బలవంతంగా ఉక్రెయిన్ కు ఇప్పిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన వచ్చిన విధానంపై కూడా చర్చ జరుగుతోంది.


భారత్ అమెరికా, యూరప్ దేశాల బాటలో పయనించాలని జర్మనీ ఛాన్స్ లర్ ఉచిత సలహా ఇచ్చారు. శాంతికి కట్టుబడి ఉన్నాం. అలాగే సార్వభౌమత్వం విషయంలో కూడా కఠినంగానే ఉంటామని ఇండియా చెప్పింది. ఎలాంటి సందర్భంలోనైనా శాంతి ప్రక్రియలకు సంబంధించి భారత్ ముందుగానే ఉంటుందని ప్రధాని మోడీ చెప్పారు. ప్రధాని మోడీ ఢిల్లీలో జర్మనీ ఛాన్స్ లర్ తో చర్చలు జరిపారు.


ఆహారం, పెట్టుబడులు, నూతన సాంకేతికత, ఇంధన భద్రత, వాణిజ్య, వ్యాపార పెట్టుబడులు, దైపాక్షిక సంబంధాలపై మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి తీవ్ర విపత్తు లాంటిదని జర్మనీ ఛాన్స్ లర్ అన్నారు. ఇది ప్రపంచం పై పెను ప్రభావాన్ని చూపిందన్నారు. ఈ అంశంపై మనం వేసే అడుగులో కచ్చితంగా స్పష్టత ఉండాలన్నారు. హింసామార్గం ద్వారా దేన్ని సాధించాలేమన్నారు. ఐక్యరాజ్య సమితిలో దీని గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. హింస తో సరిహద్దులను మార్చలేరని అన్నారు.


ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమస్యను దౌత్య మార్గాలు, శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఎప్పటి నుంచో చెబుతున్నాం. దానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. భారత్, జర్మనీ మధ్య రక్షణ, భద్రత వ్యవస్థ లో వ్యుహాత్మకంగా ముందుకు సాగేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రస్తుతం జర్మనీ ఛాన్స్ లర్ రెండు రోజుల పర్యటనకు భారత్ వచ్చిన సందర్భంలో ఇరు దేశాధినేతలు కూర్చుని చర్చించుకున్నారు. ఈ సమయంలో  ఒత్తిడి చేయాలని జర్మనీ ప్రయత్నించినా దాన్ని భారత్ ఏ మాత్రం పట్టించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: