భారతీయుల రక్తంలోనే సేవ చేసే గుణం ఉంటుంది. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ ఉత్పాతం జరిగినా సేవ చేయడానికి బృందాలను ఏర్పాటు చేస్తుంది భారతదేశము. కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఎక్కడ ఏ ఉత్పాతాలు వచ్చినా సరే సేవ చేయడానికి తనుకు తానుగా భారతదేశం ముందు ఉంటుంది.  


ప్రపంచ దేశాల్లో ఎక్కడ భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఏం వచ్చినా సరే బృందాలుగా ఏర్పడి పరుగులు పెట్టుకుంటూ వెళ్తారు భారతదేశం వాళ్ళు. మొన్న టర్కీ, సిరియాలో జరిగిన భూకంపాల టైంలో కూడా అలానే వెళ్లి సేవ చేశారు. దానికి అయ్యే ఖర్చును కేంద్రం భరిస్తుంది. అంతెందుకు కరోనా టైంలో భారత్ తాను ఒక పక్కన బాధపడుతూ కూడా ప్రపంచ దేశాలకు మందులు, మాస్కులు, ఆహారాన్ని కూడా పంపింది. ఉక్రెయిన్ యుద్ధం లో అలాంటి సాయం చేస్తూనే, ఆఫ్రికన్ కంట్రీస్ కి కూడా తన సాయాన్ని ఇప్పుడు అందిస్తుంది భారతదేశం.


అయితే భారత్ అలా సేవలు చేస్తూ వాటికి కూడా యుద్ధాల తరహాలో మంచి పేర్లు పెడుతుంది. మిషన్ అనే పేర్లతో భారతదేశం తాను చేసే సేవలకు పెట్టే పేర్లు సంస్కారహీనంగా ఏమీ ఉండడం లేదు. నేపాల్ లో 2015లో జరిగినటువంటి సేవకు "ఆపరేషన్ మైత్రి" అని పేరు పెట్టారు. 2017 లో ఎమెన్ లో జరిగినప్పుడు "ఆపరేషన్ రాహత్" అని పేరు పెట్టారు. 2016లో సూడాన్ లో జరిగినప్పుడు "ఆపరేషన్ సంకట్ మోచన్" అని పేరు పెట్టారు.


2021 లో ఆఫ్ఘనిస్తాన్ లో సేవ చేసినప్పుడు దానికి "ఆపరేషన్ దేవి శక్తి" అని పేరు పెట్టారు. 2022లో జరిగినప్పుడు "ఆపరేషన్ గంగా" అనే పేరూ, 2023లో టర్కీలో జరిగినప్పుడు "ఆపరేషన్ దోస్" అనే పేరు పెట్టారు. చేసే సేవలే కాదు ఆ సేవలకు పెట్టే పేర్లు కూడా ఎంతో బాధ్యతాయుతంగా పెడుతున్నారు భారతదేశం వాళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి: