అదానీ అనే వ్యక్తి ని ఏపీలో ఓ ప్రధాన పత్రిక టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అదానీ ఏం చేసినా వంక పెట్టి చూపించడానికి అది సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి రాసే లేదా చూపించే జర్నలిజాన్ని అసలు ఏమనాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఎందుకు టార్గెట్ చేయడం అనే విషయానికి వస్తే సోలార్ పవర్ యొక్క ధరలకి సంబంధించి రివ్యూలు జరుగుతున్నాయి కదా. ఆ ధరను పెంచమన్నాడట, అది కూడా యూనిట్ కు 15 పైసలు పెంచమన్నాడట. దీనివల్ల 350 కోట్లు రాష్ట్రానికి భారం.


ఇప్పుడు ఇంతకీ ఎంత ఇస్తున్నారు అంటే యూనిట్ 2 రూపాయల 49 పైసలకి ఇస్తున్నారు. దానిపై ఇంకో 15 పైసలు పెంచమన్నారట. మామూలుగా అయితే సోలార్ పవర్ ధరలు ఇంకా తగ్గించాలని అడగాలి కదా మరి పెంచమని అడగడం ఏంటని జనాల సందేహం. కానీ అదాని అడిగాడు కాబట్టి అదొక దుర్మార్గం. 20 రూపాయలకి కూడా కరెంటు కొన్నాం గతంలో. దానివల్ల ట్రూ అప్ చార్జీలని బాది వదిలిపెడుతున్నారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రూ"2.49 పైసలు నుండి  రూ"2.50 పైసల వరకు పవర్ ఇస్తానంటే 4.50 రూపాయల నుండి 7.50 రూపాయల వరకు రాసేసి మరి కొన్నారు.


అది కూడా రాబోయే 20 ఏళ్ల వరకు లెక్కేసి మరి. అప్పటికి 10 నుండి 2 1/2 రూపాయలకి కరెంటు చార్జీలు తగ్గిపోతుంటే 6.50 నుండి 7.50 రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు, అది కూడా ఒక 20 ఏళ్ల పాటు. అంటే దోచి పెట్టడం అన్నమాట. కానీ అప్పుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం వార్తలు రాయకుండా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. అదానిమీద కోపం, జగన్ మీద ద్వేషం ఈ రెండిటిని కలిపి సాధిస్తున్నటువంటి వార్తల కథనాలతో, జర్నలిజం విలువని దిగజారుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఆ పత్రిక పద్ధతి ఇదేనా అన్న ప్రశ్నలు నెలకొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: