
అయినా ఇట్లాంటి వాటిని వెటకారం చేసేటువంటి కమ్యూనిస్టులు పాలించేటువంటి చైనా మాత్రం భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ కి తన పేరు పెట్టేసుకుంటుంది. ఇప్పుడు అది జపాన్ లోని దీవులకు కూడా దాని పేరు పెట్టేసి అది కూడా నా దేశమే ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియాలో ఉండే ప్రదేశాలను కూడా, నా భూభాగాలే అంటుంది. ఎట్లా అంటే 19-20వ శతాబ్దంలో రష్యా రాజులు వెళ్లి చైనా పై దాడి చేశారు, చైనా ఓడిపోయి కొన్ని భూభాగాలను రష్యాకు వదిలేసింది.
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒకరకంగా రష్యా చైనా మీద డిపెండ్ అయి ఉంది. ఈ పరిస్థితిని అసరా చేసుకుని 19- 20వ శతాబ్దాల్లో మా ప్రాంతాలను మీరు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అవి మావే అంటూ చైనా ఆ ప్రాంతాలకు పేర్లు పెట్టేసుకుంటుంది. తన దేశంలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది.
అందులో పార్టులకు చైనా పెట్టుకున్న పేర్లు ఇవి, ఇలా మేం పేర్లు మార్చేశాం, ఇక అవి రష్యాలోని అంతర్భాగాలు కావు చైనాలోని అంతర్భాగాలు అని అధికారికంగా కూడా ప్రకటించేసింది చైనా. ఒక పక్కన చైనా తో కలిసి అమెరికాకు వ్యతిరేకంగా కూటమని ఏర్పాటు చేయడానికి ఒక పెద్ద గేమ్ నడపబోతున్న రష్యాకి ఇదొక షాకింగ్ పరిణామం. ఒకవేళ తాము అలాంటి నాయకత్వాన్ని తీసుకొచ్చిన దాన్ని చైనా ఎక్కడ లాగేసుకుంటుందో అని భయపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది చైనా.