ఎమ్మెల్సీ ఎన్నికలు ఆంధ్రలో జరగబోతున్నాయి. ఇకపై జరగబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ఇప్పటికే ప్రకటించింది. మున్సిపల్, కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎవరైనా చనిపోయిన ప్రాంతాల్లో మాత్రం పోటీని స్వయంగా విరమించుకుంది. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించింది. మిగతా రెండు చోట్ల వదిలేసింది. దీనికి కారణం ఆ కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చారని తెలిపింది.


ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ వారు జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని చెబుతున్నారు. వైసీపీ, బీజేపీకి రెండింటికి వ్యతిరేకంగా ఓటు వేసేది ఆ నాయకులే. అయితే జనసేన బీజేపీతో పొత్తు ఉన్నామని చెబతూ తన రూట్లో తాను ప్రయత్నిస్తూనే ఉంది. ఎందుకంటే ఇటు టీడీపీతో కూడా పొత్తు విషయంలో ముందుకు సాగుతున్న విషయం అందరికి తెలిసిందే.


బీజేపీకి షాక్ ఇస్తూ జనసేన చేసిన ప్రచారం ఎంటంటే మీరు ఎవరికైనా ఓటు వేయండి కానీ జగన్ కు వేయొద్దని చెబుతున్నారు. అంటే బీజేపీతో జనసేన పొత్తు ఉత్తుత్తిదేనని అర్థం అవుతోంది. ఎందుకంటే ఎవరికైనా వేయండి అంటే దానర్థం టీడీపీ నిల్చొపెట్టిన అభ్యర్థికి వేయమని చెప్పినట్టా.. లేక ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఏమైనా వేయమని చెప్పినట్లా.. మొత్తం మీద జనసేన బీజేపీ పొత్తు కలయిక ఉత్తుత్తిగానే కనిపిస్తోంది.


జనసేన టీడీపీతో పొత్తుకే ఎక్కువ ఆశ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీని తిట్టిపోసిన టీడీపీతో ఒక చేయి.. బీజేపీతో మరో చేయి కలుపుతూ ఆ రెండు పార్టీలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మార్చి 14 న జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ సభ జరుగుతుంది. మరి అందులో జన సైనికులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. పొత్తుకే సై అంటారా.. ఒంటరిగా పోటీ చేస్తారా.. లేదు జగన్ ని ఓడించడమే లక్ష్యంగా టీడీపీతో కలుస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: