పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నట్లు విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో తేలింది. అవి ఎప్పుడు వస్తాయి. ఎన్ని వస్తాయన్నది త్వరలోనే తేలనుంది. సమ్మిట్ ఏ విధంగా జరుగుతుందా అని మదనపడిన ప్రభుత్వానికి విజయవంతం కావడం ఊరట కలిగించేదే. ప్రస్తుతం ఆన్లైన్ విధానం ద్వారా 14 పరిశ్రమలను ప్రారంభించారు. 3840 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. విదేశాలకు సంబంధించిన వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సమ్మిట్ కు వచ్చారు. అంబానీ, అదానీలు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు.


రెడ్డీస్ ల్యాబ్ ఛైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ పెట్టుబడులకు స్వర్గధామంలా మారిందని అన్నారు. అపాచీ హిల్టా డైరెక్టర్ ఏపీ ప్రగతిలో భాగస్వామిగా మారినందుకు సంతోష పడుతున్నామని ప్రకటించారు. హెటిరో ఎండీ డాక్టర్ వంశీ కృష్ణ వచ్చే రెండేళ్లలో 1000 కోట్ల పెట్టుబడులను అనౌన్స్ చేశారు. సుచిత్ర ఎల్ల భారత్ బయోటెక్ ఎండీ మాట్లాడుతూ.. వైఎస్ ఆనాడు సహకరించారు. ఇప్పడు జగన్ సహకరిస్తున్నారని అన్నారు. ఫార్మా కంపెనీలు అన్ని వస్తున్నాయని లారాస్ కంపెనీ వారు  చెప్పారు.


ప్రపంచ మెడికల్ ఉత్పత్తిలో అధిక భాగం ఆంధ్ర నుంచే వస్తున్నట్లు తెలిపారు. రామ్ కో, క్రిబ్ కో, ఎకో స్టీల్, ప్రతిష్టా బిజినెస్, క్లింబర్లీ, డిస్కన్, నార్త్ సొల్యూషన్లు, నార్త్ ఇన్ ప్రా ఇన్ స్ట్రక్చన్స్, టెక్ విషెష్ సాప్ట్ వేర్, నియోనిల్ గ్రూపు, సర్రె, చాంపియన్ క్లబ్, పార్లెజీ, ఎల్ జీ పాలిమర్స్, హవెల్స్ ఇండియా, పోలో, స్పార్క్, ఎండనా ఎనర్జీస్, గోకుల్ గ్రూప్, ఇలా చాలా కంపెనీలు 250 కోట్ల నుంచి 500 కోట్ల వరకు పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. అయితే మోడీ ఆశీస్సులు జగన్ పై ఉండటం వల్లే ఈ సమ్మిట్ విజయవంతం అయిందని అనుకుంటున్నారు. ఈ సదస్సుకు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, సోనావాల్ లాంటి కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: