రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్, వడ దెబ్బ పై జూమ్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సమీక్షా సమావేశం నిర్వహించి త్వరలో వారం రోజులు ఫీవర్ సర్వే చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. దీంతో ఏర్పాట్లపై డిఎంహెచ్వోలకు పలు ఆదేశాలిచ్చిన క్రిష్ణ బాబు.. ఇన్ఫ్లుయంజా వైరస్, వడదెబ్బ పై కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రంలో అప్రమత్తంగా వున్నామన్నారు. వారంరోజులపాటు ఫీవర్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు.


వడ దెబ్బ కు గురికాకుండా ప్రజల్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వోలకు ఆదేశాలు ఇచ్చిన క్రిష్ణ బాబు.. స్వచ్ఛంద సేవా సంస్థల్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎండ వేడిమి ఎక్కువగా వున్న సమయంలో ప్రజలు బయట తిరగకుండా వుండేలా అలెర్ట్ చెయ్యాలని.. ఎన్జీవోలతో కలెక్టర్లు సమావేశాన్ని ఏర్పాటు చేసేలా డిఎంహెచ్వోలు చొరవ తీసుకోవాలని.. శీతల నీటి కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని... ఓఆరెస్ ప్యాకెట్లు విలేజ్ క్లినిక్ ల స్థాయిలో సిద్ధం చేసుకోవాలని క్రిష్ణ బాబు సూచించారు.


డీహైడ్రేషన్ కు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని.. ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించే విషయంలో ఎమ్ ఎల్ హెచ్పీలకు తగిన శిక్షణ ఇవ్వాలని.. ఎంఎల్ హెచ్ పీలు , ఎఎన్ఎం లు సమన్వంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని క్రిష్ణ బాబు తెలిపారు. విలేజ్ వాలంటీర్ల సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని.. బహిరంగ ప్రదేశాలు , జన సమ్మర్ద ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని.. కాలేజీలు, స్కూళ్లలో పరిస్థితులననురించి తగిన చర్యలు తీసుకునేలా ఆయా శాఖలకు పలు సూచనలు చేయాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కు క్రిష్ణ బాబు ఆదేశాలు జారీ చేశారు.


ఈనెల 14న రాష్ట్రంలో నేషనల్ డీవార్మింగ్ డే ఏర్పాట్లపై పలు సూచనలు చేసిన క్రిష్ణ బాబు.. ఎండీవోల వద్ద నుండి నులిపురుగు మాత్రల్ని తీసుకునేలా ఎమ్ఎల్ హెచ్పీలు , ఎఎన్ఎంలు సమన్వయం చేసుకోవాలన్నారు. రక్తహీనత నివారణలో భాగంగా నే నులిపురుగుల నిర్వహణ అత్యంత అవసరమన్న క్రిష్ణ బాబు.. తక్షణం లక్ష సికిల్ సెల్ కిట్లు అందుబాటులో కి తేవాలన్నారు. ఈనెలలో 3 లక్షల సికిల్ సెల్ అనీమియా కిట్ల పంపిణీ లక్ష్యంగా తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: