పాకిస్థాన్ లో 140 రూపాయాలు ఉన్న పెట్రోల్ రూ. 200 దాటిపోయింది. డిజీల్ ధర లీటరుకు రూ. 280 వరకు పెరిగిపోయింది. మొన్నటి దాకా రూ. 60 వేలు ఉన్న బంగారం ధర ప్రస్తుతం రూ. 2 లక్షలకు చేరిపోయింది. ఇలా ధరలు పెరిగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఐఎంఎఫ్ ఆరున్నర బిలియన్ డాలర్ల అప్పు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. దీంతో సబ్సిడీలు ఎత్తివేసిన పాక్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది.


పాకిస్థాన్ లో పది రోజులు ఉన్న ఐఎంఎఫ్  అధికారులు ఇంకా అప్పు ఇవ్వాలంటే మరి కొన్ని ఆర్థిక అంశాల్లో  మార్పులు చేయాలని పాక్ ను కోరింది. ఐఎంఎఫ్ చేత అమెరికా అప్పు ఇప్పించాలని పాకిస్థాన్ వేడుకుంటోంది. రష్యాకు భారత్ సపోర్టు చేస్తుందని పాక్ పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉంది. కానీ అమెరికాకు నేరుగా చెప్పడం లేదు.


పాకిస్థాన్ ఆర్థిక పరంగా తీవ్ర సమస్యల్లో చిక్కుకుంది. తాజాగా ఐఎంఎఫ్ లోన్ వస్తేనే పాకిస్థాన్ కు కాస్త ఊరట కలుగుతుంది. కానీ అది ఇచ్చిన అప్పు వల్ల పాకిస్థాన్ లో ఉన్న సమస్యలు ఇప్పటికిప్పుడు ఏం తీరిపోవు. ఎందుకంటే అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. అప్పులు పెరిగిపోయాయి. ధరలు మండిపోతున్నాయి. తినడానికి గోధుమ పిండికి కూడా లైన్లో నిల్చొని తీసుకోవాల్సిన వైనం. ఇలాంటి సమయంలో అమెరికా, చైనా వైపు పాకిస్థాన్ ఆశగా ఎదురు చూస్తోంది.


కొత్త అప్పులను తీసుకురావడానికి చాలానే కష్టపడుతుంది. ఐఎంఎఫ్ అధికారులు లీవ్ లో ఉంటే వారి లీవ్ క్యాన్సిల్ చేసి వెంటనే పాక్ కు అప్పు ఇప్పించాలని అమెరికాను కోరింది. దీనికి అమెరికా నిరాకరించింది. లీవ్ అయిపోయిన తర్వాత మాట్లాడుదాం అని పాక్ కు చెప్పింది.  ఉక్రెయిన్, రష్యా యుద్దం అనంతరం భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం కూడా పాకిస్థాన్ కు మింగుడు పడటం లేదు. పాకిస్థాన్ ఆర్థిక సమస్యల నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: