చైనాలో పూర్తిగా నియంత పాలనలోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉండేవారు. కానీ జిన్ పింగ్ ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల సభ్యులను లేకుండా చేయడంలో విజయం సాధించారు. ప్రస్తుతం ట్రబుల్ షూటర్స్ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిన్ పింగ్ ఏదీ చెప్పినా వినే వారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎకానమీ, క్రెడిబిలిటీ, ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నారు.


ఇందులో లికిజీయాంగ్ ప్లేస్ లో లిచియాంగ్ ను తీసుకున్నారు. ఇతను ఏం చెబితే అది వినాల్సిన పరిస్థితి. ఈయన షాంఘై గవర్నర్ గా పని చేశారు. కరోనా సమయంలో షాంఘైలో  మూడు కరోనా కేసులు వస్తే 25 లక్షల మందిని రెండు నెలల పాటు ఇంటి నుంచి బయటకు రాకుండా చేశాడు. తర్వాత జావ్ లేబీ ఈయన లా మేకర్ అయ్యారు. వాంగ్ పునే ఎథినిక్ రిలీజిస్ మినిస్టర్ ఈయనకు తైవాన్ గురించి బాగా తెలుసు కాబట్టి నియమించారు.


డింగ్ షూషియంగ్ ఇతను వైస్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్, ఎకానామిక్, ఇండస్ట్రీస్ పాలసీస్ గురించి ఇతను చూస్తాడు. వివిధ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను అణిచివేయడానికి ఈ కొత్త టీంను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నియమించుకున్నారు. జనరల్ వివి డాన్ ఆర్మీ నుంచి జిన్ పింగ్ టీంలో కి వచ్చాడు. తైవాన్ కూడా చైనా లో అంతర్బాగం అని చెప్పే వ్యక్తి. చైనా అమెరికాతో ఢీ అంటే ఢీ అనడానికి ముందు వరసలో ఉంటాడు.


ప్రస్తుతం చైనా అధ్యక్షుడు కొత్తగా నియమించుకున్న ఈ టీంతో ఎలాంటి ఆగడాలు సృష్టించేందుకు ప్లాన్ చేశాడో తెలియాలి. తైవాన్ ను ఆక్రమించేందుకు చైనా సిద్దమవుతున్న వేళా ఈ టీం నియామకం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. అమెరికా ఒక వేళ అడ్డుకుంటే ఎం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: