
ప్రస్తుతం పవన్ కళ్యాన్ మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. ఒక వేళ పొత్తు సక్సెస్ అయితే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంలో మాత్రం పెద్ద సమస్య ఎదురుకానుంది. బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. ఆయనకు టికెట్ కన్మర్ప్ అయిన తర్వాతనే టీడీపీ లో చేరినట్లు తెలుస్తోంది. మహసేన రాజేశ్ కు కూడా టీడీపీలో టికెట్ ఇస్తామంటేనే చేరారు.
జనసేనలోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం నుంచి పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని టీవీ రామారావు, ఈదర హరిబాబులు జనసేనలోకి వచ్చారు. వీళ్లకి పవన్ టికెట్ ఇప్పించగలరా.. ఒంగోలు సీటు హరిబాబు, కొవ్వూరు స్థానం రామారావుకు కావాలి. పొత్తు పెట్టుకున్న తర్వాత టీడీపీని ఒప్పించి ఈ రెండు స్థానాలకు పవన్ టికెట్ ఇప్పించగలరా అనేదే ప్రశ్న.
మంగళగిరిలో సీపీఎం పట్టు ఉన్న స్థానంలో సీపీఐకి సీటు ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇది తెలుగుదేశం ఆధ్వర్యంలోనే జరిగింది. దీంతో అక్కడ లోకేష్ ను గెలిపించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. మొదట్లో చంద్రబాబును విమర్శించిన పవన్ కళ్యాణ్, తర్వాత అధికారంలో లేని జగన్ పై ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. టీడీపీ, జనసేన మధ్య సఖ్యత కుదిరిందని ఆనాడు అందరికీ తెలిసిపోయింది.
చిరంజీవి పెట్టిన పార్టీని దెబ్బతీసిన టీడీపీతో పవన్ కళ్యాణ్ నడవడం అంటే పప్పులో కాలేసినట్లే. ఒక్కసారి టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే తెలుస్తోంది పచ్చ మీడియా ఎలాంటి నరకం చూపిస్తారో అన్న వాదన ఉంది. ఒకవేళ పొత్తు ఒకే అయితే వారిచ్చినా సీట్లు తీసుకోవడం తప్ప పవన్ తన అనుచరులకు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకుంటాడో లేదో చూడాలి.