ఇప్పుడు తెలుగుదేశం ఏదో ఒకటి తేల్చి చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా పిలిచింది. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి తేవాలి, పార్టీ పగ్గాలు అప్పు చెప్పాలని పోస్టర్స్ హోర్డింగ్ లు పెడితే దానికి సమాధానం చెప్పలేదు. ఎవరో ఒక మనిషి వచ్చి పవన్ కళ్యాణ్ ని కలుపుకి వెళ్ళాలి అని అనగానే వన్ సైడ్ లవ్ టైప్ లో తన ఇంటెన్షన్ ని ప్లే చేసినట్టయింది అక్కడ.


ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా నేను సిద్ధమని చెప్పడం, ఆ తర్వాత వైజాగ్ లో దాడుల పేరుతో చంద్రబాబు వచ్చి పవన్ కళ్యాణ్ తో భేటీ, అట్లాగే చంద్రబాబుని అవమానించారన్న పేరుతో పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబుతో భేటీ ఇలా వీళ్ళిద్దరూ రెండుసార్లు బేటి అయ్యారు.


ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి 30సీట్లు మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకునేది కాపులు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా. కాకపోతే తమకు ప్రాధాన్యం కావాలని కోరుకుంటున్నారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి పదవిలో కనీసం ఒక్క సంవత్సరం అయినా పవన్ కళ్యాణ్ ని చూడాలనుకుంటున్నారు ఆయన వర్గాలు వారు.  దాంతోపాటుగా దాదాపు 50 సీట్లు వరకు జనసేన తెలుగుదేశం ని అడుగుతుంది. కానీ అది కూడా ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు.


అయితే పవన్ కళ్యాణ్  మళ్లీ వచ్చినటువంటి నేపథ్యంలో హరిరామ జోగయ్య గారు ఈ చర్చలు పరోక్షంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో చీప్ అండ్ బెస్ట్ వాటికి వెళ్ళేటటువంటి ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్  చెప్పారు.  జనసేన మనిషినని చెప్పుకుంటున్న మహాసేన రాజేష్ ను, అలాగే జనసేన కన్నా లక్ష్మీనారాయణని తీసుకెళ్లి తెలుగుదేశంలో చేర్చుకోవడంతో,  తెలుగుదేశం నుండి ఈదర హరిబాబుని, టీవీ రామారావు ని తీసుకొచ్చి జనసేనలో చేర్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: