ఇక్కడ పార్టీ లాబీయిస్టులు ఎంత తెలివిగా ఉంటారంటే గురు శిష్యులైన చంద్రబాబుకి, చంద్రశేఖర్ కి ఇద్దరికీ కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. వాళ్లు ఎలాంటి తెలివైన పాయింట్ ని పట్టారు అంటే..సిబీఐ ఢిల్లీ పోలీస్ శాఖ కింద ఉంది, ప్రతి ఏడాది కూడా దానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా లైసెన్స్ రెన్యువల్ విచారణ చేస్తూ ఉంటారు. విచారించుకోవడానికి పర్మిషన్ లేదని రిజెక్ట్ చేస్తే చేయడానికి ఏమీ లేదు. సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.
మోడీ మనల్ని ఏమీ పీకలేడని చెప్పగానే చంద్రబాబు రెన్యువల్ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేసేసారు. ఆంధ్రాలో విచారణ ఆపేసి సుప్రీంకోర్టు దాకా వెళ్లినా ఏం కాలేదు. రెండో పక్కన చంద్రబాబు పైన ఉన్న సిబిఐ విచారణని కుదరదు అన్నట్లుగా ఆ రోజుకి ఆపించుకోగలిగారు. వివేకా కేసు విచారణ కూడా సిబిఐ కుదరదు అన్నందుకే కదా ఆగిపోయింది. అంతటి లిటికేషన్ పాయింట్ ని కూడా మన వాళ్ళే చెప్పారు.
ఇప్పుడు కెసిఆర్ కీ కూడా ఈడి విషయంలో ఎవరో చాలా తెలివైన సలహా ఇచ్చారు. ఉదయం 10-6 గంటల వరకు మాత్రమే విచారించాలని ఉన్నా, మొన్న 8:30 వరకు విచారించారు కాబట్టి, ఈ దఫా వాస్తవంగా అలా విచారించడానికి కుదరదని కేసు వేశారు. ఇంతకుముందు కనిమౌళిని కూడా విచారించారు కదా. కానీ ఆ పాయింట్ ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లినప్పుడు రేపు పొద్దున ఈ పాయింట్ ని బేస్ చేసుకుని ఏమైనా తీర్పు ఇవ్వచ్చేమో..